బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజ హెగ్డే
Wednesday, June 28, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీవాస్-ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇటీవల ప్రారంభమై.. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన "దువ్వాడ జగన్నాధం" చిత్రం సాధిస్తున్న అఖండ విజయంలో తన అందాలతో కీలకపాత్ర పోషించిన పూజ హెగ్డేను కథానాయికగా ఎంపిక చేశారు. ఈ చిత్రంలో జగపతిబాబు, రవికిషన్, మధు గురుస్వామి (కన్నడ నటుడు) ప్రతినాయక పాత్రలు పోషించనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. "పూజ హెగ్డేను కథానాయికగా ఎంపిక చేయడం జరిగింది. ఆమెది సినిమాలో చాలా కీలకమైన పాత్ర, అందంతోపాటు అభినయ ప్రదర్శనకు ఆస్కారమున్న సముచితమైన పాత్రను పూజ పోషించనుంది. రామోజీ ఫిలింసిటీలో 10 రోజులపాటు జరిగిన మొదటి షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్ లో జగపతిబాబు మరియు ఇతర ఆర్టిస్టులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. సెకండ్ షెడ్యూల్ నుండి పూజ హెగ్డే చిత్రీకరణలో పాల్గొననుంది. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా.. టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. మ్యూజికల్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యం వహించనుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ పీటర్ హైన్స్ ఈ సినిమా కోసం డిఫరెంట్ ఫైట్స్ ను డిజైన్ చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ రైటర్ సాయిమాధవ్ బుర్రా గారు ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చనుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది" అన్నారు.
అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ.. "పూజ హెగ్డే టీమ్ లో జాయిన్ అవ్వడంతో.. సినిమాకి మంచి గ్లామర్ అట్రాక్షన్ పెరిగింది. ఈ సినిమాలో పూజను మరింత గ్లామరస్ గా ప్రెజంట్ చేయనున్నారు డైరెక్టర్ శ్రీవాస్. కథకి తగినట్లుగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments