పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సెకండ్ వేవ్ మరింత వేగంగా విస్తరిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రాజకీయ, సినీ ప్రముఖులకు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించింది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానని పూజా హెగ్డే వెల్లడించింది.
‘‘హలో ఎవ్రీవన్.. నేను తాజాగా టెస్ట్ చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కోవిడ్‌కు సంబంధించిన అన్ని ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ నేను ఐసోలేషన్‌లో, హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఈ మధ్య కాలంలో నాతో సన్నిహితంగా మెలిగిన వారంతా కూడా టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నా. మీ ప్రేమకు, సపోర్ట్‌కు ధన్యవాదాలు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. దయచేసి ఇంట్లోనే ఉండండి.. సేఫ్‌గా ఉండండి’’ అని పూజా హెగ్డే ట్వీట్‌లో పేర్కొంది. గతేడాది లాక్‌డౌన్ తర్వాత షూటింగ్స్‌కు పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ ఇటు తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల షూటింగ్స్‌తో బాగా బిజీగా మారిపోయింది. ప్రస్తుతం కరోనాగా నిర్ధారణ కావడంతో పూజా హెగ్డే రెస్ట్ తీసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com