పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్

  • IndiaGlitz, [Monday,April 26 2021]

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సెకండ్ వేవ్ మరింత వేగంగా విస్తరిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రాజకీయ, సినీ ప్రముఖులకు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించింది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానని పూజా హెగ్డే వెల్లడించింది.

‘‘హలో ఎవ్రీవన్.. నేను తాజాగా టెస్ట్‌ చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కోవిడ్‌కు సంబంధించిన అన్ని ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ నేను ఐసోలేషన్‌లో, హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఈ మధ్య కాలంలో నాతో సన్నిహితంగా మెలిగిన వారంతా కూడా టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నా. మీ ప్రేమకు, సపోర్ట్‌కు ధన్యవాదాలు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. దయచేసి ఇంట్లోనే ఉండండి.. సేఫ్‌గా ఉండండి’’ అని పూజా హెగ్డే ట్వీట్‌లో పేర్కొంది. గతేడాది లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్స్‌కు పర్మిషన్‌ ఇచ్చినప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ ఇటు తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల షూటింగ్స్‌తో బాగా బిజీగా మారిపోయింది. ప్రస్తుతం కరోనాగా నిర్ధారణ కావడంతో పూజా హెగ్డే రెస్ట్ తీసుకుంటోంది.

More News

కరోనా ఎఫెక్ట్.. మహిళా కానిస్టేబుల్‌కు స్టేషన్‌లోనే మంగళ స్నానం..

కరోనా మహమ్మారి కారణంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి సెలవులు కూడా దొరకడం లేదు. పెళ్లైనా.. పేరంటమైనా కూడా ఏదో ఒకటి అర సెలవులతో సరిపెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం అన్ని

ఆక్సిజన్‌కు బదులుగా నెబ్యులైజర్ వాడకండి!

ఓ వైపు కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తుంటే.. మరోవైపు ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆక్సిజన్ కొరత కారణంగా ప్రతిరోజూ దేశంలో ఏదో ఒక చోట పదుల సంఖ్యలో జనం మరణిస్తూనే ఉన్నారు.

సినీ నటుడు పొట్టి వీరయ్య ఇక లేరు..

ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య(74) ఇకలేరు. ప్రస్తుతం హైద‌రాబాద్ చిత్ర‌పురి కాల‌నీలో నివాసముంటున్న ఆయ‌న గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

‘అరవింద సమేత’ను మించి ‘అన్నాత్తె’ లుక్ భయంకరంగా ఉంటుంది: జగపతిబాబు

స్టైలిష్ విలన్ జగపతిబాబు. మరో పాత్ర కోసం సిద్ధమవుతున్నారు. ఆ పాత్రలో ఏ రేంజ్‌లో విలనిజం కనిపిస్తుందంటే.. ‘అరవింద సమేత’లో బసిరెడ్డికి మించి. దాని కోసం ఆయన రిహార్సల్స్ కూడా వేస్తున్నారు.

నేడు వివాహం చేసుకున్న ‘క్రాక్’ సినిమాటోగ్రాఫర్ విష్ణు

అట్లీ దర్శకత్వం వహించి, కమాండర్ విజయ్ నటించిన ‘అదిరింది’, విజిల్, తెలుగు చిత్రం క్రాక్‌ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన జికెవిష్ణు నేడు వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యారు.