రెమ్యునరేషన్ వివాదం.. స్టార్ హీరోయిన్ కి పూజా హెగ్డే సపోర్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్లకు కూడా హీరోలతో సమానంగా పారితోషికం ఉండాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. క్రేజీ బ్యూటీ తాప్సి ఈ విషయంలో ముందు నుంచి గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆడియన్స్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలని కూడా ఆదరిస్తున్నారని.. కాబట్టి హీరోలతో సమానంగా తమకి కూడా రెమ్యునరేషన్ ఉండాలని తాప్సి గతంలో కామెంట్స్ చేసింది. అలాగే పౌరాణిక చిత్రంలో సీత పాత్ర కోసం కరీనా కపూర్ 12 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.
కరీనా కపూర్ ని అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేయడాన్ని తాప్సి సమర్ధించింది. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి మద్దతు తెలిపింది. ఆమె ఎవరో కాదు.. బుట్టబొమ్మ పూజాహెగ్డే. పూజా హెగ్డే సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు. దీనితో ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డేకి కరీనా కపూర్ సీత పాత్ర కోసం 12 కోట్లు డిమాండ్ చేయడం గురించి ప్రస్తావన వచ్చింది.
ఇలాంటి విషయాల్లో ప్రజలకు ఎప్పుడూ ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ కరీనా తనకు కావాల్సింది అడిగింది. ఆ హక్కు ఆమెకు ఉంది. ఈ విషయంలో చివరగా నిర్ణయం తీసుకోవాల్సింది నిర్మాతలు. కరీనా తనకు అవసరమైన డిమాండ్ చెప్పింది. నిర్మాతలకు అది ఒకే అయితే వాళ్ళు చర్చించుకుంటారు. ఇలాంటి విషయాల్లో ప్రజల నుంచి విమర్శలు, ట్రోలింగ్ సహజం. ఈ జాబ్ లో ఇది కామన్ గా మారిపోయింది. కరీనాకు మరింత శక్తి చేకూరాలి అని పూజా హెగ్డే కోరింది.
సహజంగా కరీనా ఒక చిత్రానికి 6 నుంచి 7 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తుంది. కానీ సీత పాత్ర కోసం ఏకంగా రూ 12 కోట్లు డిమాండ్ చేయడంతో బాలీవుడ్ సైతం ఆశ్చర్యంలో మునిగిపోయింది. పౌరాణిక పాత్ర కోసం మరీ ఇంత డబ్బు అడుగుతుందా అంటూ మత పరంగా కరీనా కపూర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చెలరేగిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments