Pooja Hegde : పింక్ కలర్ డ్రెస్‌లో నవ్వులు, కొంటె ఫోజులు... ‘‘సైమా’’ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా బుట్ట బొమ్మ
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాదిలో ప్రత్యేకించి తెలుగులో కమర్షియల్ సినిమాలకు, స్టార్ హీరోల మూవీస్‌కి హీరోయిన్ కావాల్సి వస్తే అందరి చూపు పూజా హెగ్డే వైపే. తన అందం, అభినయంతో ఆమె వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు. యూత్‌లో పూజా హెగ్డే క్రేజ్ ఏ రేంజ్లో వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల బెంగళూరులో జరిగిన సైమా అవార్డ్స్ సెర్మనీలో బుట్టబొమ్మ సందడి చేసింది. అంతేకాదు... అదిరిపోయే డ్రస్‌తో మొత్తం ఈవెంట్‌కే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లో తన నటనకు గాను పూజా హెగ్డే ఉత్తమ నటిగా (తెలుగు) అవార్డును గెలుచుకుంది. దీనితో పాటు యూత్ ఐకాన్ సౌత్ (ఫిమేల్) అవార్డు కూడా అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా అవార్డు తీసుకుంటూ తన ఆనందాన్ని పంచుకుంది పూజా. ఈ సందర్భంగా సైమా ఫంక్షన్లో పూజా హెగ్డే దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పింక్ కలర్ సిండ్రెల్లా డ్రస్‌లో మెరిసిపోయిన ఆమె పలికించిన ఎక్స్ప్రెషన్స్ యూత్‌ను ఫిదా చేస్తున్నాయి.
అవిశ్రాంతంగా పనిచేస్తూనే వుండండి:
సైమాలో తాను రెండు అవార్డులు గెలుచుకున్న ఆనందాన్ని అభిమానులకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అవిశ్రాంతంగా పనిచేస్తూనే వుండాలని పూజా అభిమానులను కోరింది. అలాగే ఉత్తమ నటిగా తనకు ఓటు వేసిన వారికి , మంచి పాత్రకు తనను ఎంపిక చేసిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మేకర్స్‌కి పూజ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపోతే.. పూజా హెగ్డే చివరిగా ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో ప్రేరణ పాత్రలో నటించింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తోన్న సర్కస్‌లో రణవీర్ సింగ్ సరసన, తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో జన గణ మన ప్రాజెక్ట్‌లోనూ పూజ నటిస్తున్నారు.
వరుసగా రెండో ఏడాది బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ :
కాగా.. సైమా ఈవెంట్లో భాగంగా శనివారం తెలుగు, కన్నడ చిత్రాలకు సంబంధించిన విజేతలను మాత్రమే ప్రకటించారు. పుష్ప ది రైజ్‌లో తన అత్యుత్తమ నటనకు గాను అల్లు అర్జున్ 2022లో సైమా నుంచి ఉత్తమ నటుడి అవార్డ్ (తెలుగు) అందుకున్నారు. వరుసగా రెండోసారి ఆయన ఉత్తమ నటుడి ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. అల వైకుంఠపురం సినిమాకు గాను ఆయన బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నారు.
పునీత్ రాజ్‌కుమార్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డ్:
అల్లు అర్జున్‌తో పాటు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు యూత్ ఐకాన్ సౌత్ (మేల్) అవార్డు కూడా లభించింది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్‌కి మోస్ట్ పాపులర్ హిందీ యాక్టర్ ఇన్ సౌత్ ఇండియా అవార్డు దక్కింది. దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌ని యువరత్న చిత్రానికి బెస్ట్ యాక్టర్ (కన్నడ)తో సత్కరించారు. ఇక అవార్డులు గెలుచుకున్న మిగిలిన స్టార్స్ విషయానికి వస్తే.. పుష్ప ది రైజ్ చిత్రంలో నటనకు గాను జగదీశ్ ప్రతాప్ భండారికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (తెలుగు) అవార్డు దక్కింది. క్రాక్ చిత్రంలో నటనకు గాను వరలక్ష్మీ శరత్ కుమార్‌ని ఉత్తమ సహాయ నటి (తెలుగు) అవార్డుతో సత్కరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments