అఖిల్‌కు నో చెప్పేసిన పూజా హెగ్డే
- IndiaGlitz, [Tuesday,September 10 2019]
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తోన్న నాలుగో చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను గీతాఆర్ట్స్, యు.వి.క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే కొన్నిరోజుల ముందు అఖిల్‌తో నటించడానికి పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఈ సినిమా కోసం పూజా హెగ్డే భారీగానే డిమాండ్ చేసిందని.. అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు ఓకే చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి.
అయితే ఇప్పుడు సీన్ మారిందని సమాచారం. పూజా హెగ్డే చాలా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. ఈ రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. ఎందుకంటే వీలైనంత మినిమం బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేసి కంటెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నారట. దీని వల్ల నిర్మాతలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రావడమే కాదు.. హీరోగా అఖిల్‌కు సక్సెస్ కూడా దక్కే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
పూజా హై రెమ్యురేషన్ డిమాండ్ చేస్తుండటంతో మరో హీరోయిన్ను తీసుకుంటే ఎలా ఉంటుందోనని యూనిట్ ఆలోచనలో పడిందట. పూజాహెగ్డే స్థానంలో కేతికా శర్మను తీసుకోవాలనుకుంటున్నారని టాక్. కేతికా తొలి తెలుగు చిత్రం రొమాంటిక్ ఇంకా విడుదల కాలేదు. ఈమె అయితే పాత్రకు న్యాయం చేస్తుందని నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు చేస్తున్నారని టాక్.
అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు బాక్సాఫీస్ అఖిల్‌కు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో అఖిల్ .. తన నాలుగో చిత్రంపై బాగానే ఆశలు పెట్టుకున్నాడు.