నా మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు: పూజా హెగ్డే
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాదిపై సంచలన వ్యాఖ్యలు చేసి ట్రోలర్స్‌కి హీరోయిన్ పూజా హెగ్డే అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో పెను దుమారాన్నే రేపాయి. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దీంతో పూజా హెగ్డే తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది. తాను ఒక సందర్భంలో అన్న మాటను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారని తెలిపింది. అక్షరాన్ని మార్చగలరేమో గానీ.. అభిమానాన్ని మార్చలేరని పేర్కొంది. ‘‘నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు. అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదు..నాకు ఎప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రాణసమానం.. ఇది నా చిత్రాలను అభిమానించే వారికీ నా అభిమానులకూ తెలిసినా.. ఎటువంటి అపార్ధాలకూ తావివ్వకూడదనే నేను మళ్ళీ చెబుతున్నా. నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. పూర్తి ఇంటర్వ్యూ చూడండి’’ అని పూజా హెగ్డే వెల్లడించింది.
కాగా. దక్షిణాది వాళ్లు నడుం మత్తులో ఉంటారనీ, మిడ్ డ్రెస్‌లలోనే నాయికల్ని చూడాలనుకుంటారనీ.. హీరోయిన్ల కాళ్లు, బొడ్డుపైనే వారి దృష్టి ఉంటుందంటూ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పూజ చెప్పింది. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాది సినిమాల కారణంగా పాపులర్ అయ్యి.. స్టార్ హీరోయిన్‌గా కోట్లు వెనుకేసుకుంటున్న పూజా.. ఇలా మాట్లాడటం సబబు కాదని నెటిజన్లు మండి పడుతున్నారు. దక్షిణాదిని కించపరిచే బదులు ఆమె అసలు అలాంటి పాత్రల్లో నటించనని చెబితే బాగుంటుంది కదా అని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
స్టార్ హోదా ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షక లోకానికి పూజా తగిన గుణపాఠం చెప్పిందని... ఇక తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలంటూ ఒకింత ఘాటుగానే విమర్శిస్తున్నారు. సౌత్ ఇండియాలోనే టాప్ రేటెడ్ హీరోయిన్ అయిన పూజా.. ఇలా నోటికొచ్చిందల్లా మాట్లాడి కూర్చున్న కొమ్మను నరికేసుకుంటోందంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తారు. అసలు దీనివల్ల పూజా చెప్పదలుచుకున్నదేంటనేది కొందరి వాదన. అందం, అభినయం లేకున్నా.. రాణించవచ్చనేనా? ఆమె ఉద్దేశమని వ్యాఖ్యానిస్తున్న వాళ్లూ లేకపోలేదు. ఇలా విపరీతంగా విమర్శలు వెల్లువెత్తడంతో పూజా స్పందించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout