అఖిల్ కోసం పూజా డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. జి.ఎ 2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చిందని వినికిడి. కొన్ని రోజుల క్రితం పూజా హెగ్డేని హీరోయిన్గా తీసుకుంటారని వార్తలు వినిపించాయి. రీసెంట్గా పూజా హెగ్డే భారీ రెమ్యురేషన్ డిమాండ్ చేయడంతో ఆమె స్థానంలో కేతికాశర్మను హీరోయిన్గా తీసుకున్నారని వార్తలు వినపడ్డాయి. కానీ చివరకు పూజా హెగ్డేనే హీరోయిన్గా ఓకే చేశారు.
ఇండస్ట్రీలో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా కోసం పూజా హెగ్డే 1.25కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడిగిందట. ఇప్పటికే ఆలస్యం కావడంతో పాటు ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తోన్న పూజా హెగ్డే తమ సినిమాలో నటిస్తే ప్లస్ అవుతుందని భావించి నిర్మాతలు ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అయిపోయారట. అలాగే ప్రస్తుతం తనకున్న డిమాండ్‌ను పూజా హెగ్డే క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. రెమ్యురేషన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. యంగ్ హీరోలైన బెల్లంకొండ శ్రీనివాస్, వరుణ్ సినిమాల్లో నటించడానికి పూజా హెగ్డే భారీగానే వసూలు చేసింది. ఇక అఖిల్ విషయానికి వస్తే.. అఖిల్ మేకింగ్ పరంగా కాంప్రమైజ్ కాకూడదని అనుకుంటున్నాడట. ఆయన తాను హీరోగా చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాల తర్వాత ఈ నాలుగు చిత్రంపై చాలా ఆశలనే పెట్టుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments