ప్ర‌భాస్ 20లో ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో పూజా హెగ్డే

  • IndiaGlitz, [Tuesday,May 05 2020]

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. కానీ.. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. దీంతో ప్ర‌స్తుతం చేస్తోన్న సినిమాపై ప్ర‌భాస్ చాలా కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేసి న‌టిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా హిందీ, తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజాహెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర‌కు సంబంధించిన వార్తొక‌టి నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వివ‌రాల మేర‌కు ఈ చిత్రంలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచ‌ర్‌గా న‌టిస్తుంద‌ని స‌మాచారం.

గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భారీ బ‌డ్జెట్‌తో సినిమా నిర్మిత‌మ‌వుతోంది. ఈ సినిమా షూటింగ్ క‌రోనా ప్ర‌భావంతో ఆగింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్ర‌భాస్ 20 విడుద‌ల‌వుతుంద‌ని అనుకున్నారు. అయితే క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా సినిమా విడుద‌ల వాయిదా పడే అవ‌కాశం ఉంది. విడుద‌లపై ద‌ర్శ‌క నిర్మాత‌లు. త్వ‌ర‌లోనే బ‌య్య‌ర్స్‌తో చ‌ర్చించి దీనిపై ఓ నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ట‌.

More News

మ‌రోసారి ఆమెతోనే జోడీ క‌డుతున్న నితిన్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్ చాలా గ్యాప్ తీసుకుని భీష్మ సినిమా చేశాడు. ఈ సినిమా ఈ ఏడాది విడుద‌లై మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు.

ఏపీలో మందుబాబులకు మరో భారీ షాక్.. పెరిగిన ధరలు ఇవీ...

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో 3.0 లాక్‌డౌన్‌లో భాగంగా మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.

టాలీవుడ్‌కు త్వరలో మంచి రోజులొస్తాయ్.. : మంత్రి తలసాని

టాలీవుడ్ ఇండస్ట్రీకి త్వరలోనే మంచి రోజులొస్తాయని సినిమాటోగ్రాఫర్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. మంగళవారం నాడు నగరంలోని ఫిల్మ్ ఛాంబర్ మీడియా మీట్ నిర్వహించిన

దుర్గమ్మ సాక్షిగా గుడి ప్రాంగణంలో అపచారం..

కోరిన కోర్కెలు తీర్చే కనకదుర్గమ్మకు చెంతకు ప్రతి రోజూ వేలాది మంది వెళ్లి దర్శించుకుంటూ ఉంటారు. అమ్మను ఏ కోరిక కోరినా తప్పుకుండా నెరవేస్తారనే భక్తుల ప్రగాఢ నమ్మకం.

విజ‌య్‌కు మెగా స‌పోర్ట్‌

ఫేక్ న్యూస్ రాస్తున్న కొన్ని వెబ్‌సైట్స్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ వెబ్‌సైట్ వ్య‌వ‌హార శైలిపై ద‌య్య‌ప‌ట్టారు. మహేశ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనీల్ రావిపూడి