ప్రభాస్ 20లో ఆసక్తికరమైన పాత్రలో పూజా హెగ్డే
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నేషనల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సాహో బాలీవుడ్, టాలీవుడ్‌లో మంచి కలెక్షన్స్‌ను సాధించింది. కానీ.. అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. దీంతో ప్రస్తుతం చేస్తోన్న సినిమాపై ప్రభాస్ చాలా కాన్‌సన్‌ట్రేషన్ చేసి నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించేలా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజాహెగ్డే మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుంది. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన వార్తొకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. వివరాల మేరకు ఈ చిత్రంలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్‌గా నటిస్తుందని సమాచారం.
గోపీకృష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా షూటింగ్ కరోనా ప్రభావంతో ఆగింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రభాస్ 20 విడుదలవుతుందని అనుకున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. విడుదలపై దర్శక నిర్మాతలు. త్వరలోనే బయ్యర్స్‌తో చర్చించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com