గ్లామర్ తోపాటు...

  • IndiaGlitz, [Monday,October 09 2017]

ఒక‌లైలా కోసం, ముకుంద సినిమాల‌తో పాటు బాలీవుడ్ చిత్రం మొహంజ‌దారో, ఈ ఏడాది విడుద‌లైన డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ కూడా పూజా హెగ్డేకు పెద్ద‌గా క‌లిసి రాలేదు. ఇప్పుడు ఈ అమ్మ‌డు శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రంలో న‌టిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో.

యాక్ష‌న్ మోడ్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రంలో పూజా హెగ్డే పాత్రకు కూడా యాక్ష‌న్ ఉంటుంద‌ట‌. అందుకోసం పూజా హెగ్డే హ్యాండ్‌ టు హ్యాండ్‌ కొంబాట్, ఫిస్ట్‌ ఫైట్స్‌లో పూజ ట్రైనింగ్‌ తీసుకుంటుంద‌ట‌. పీట‌ర్ హెయిన్స్ మాస్ట‌ర్ అధ్వ‌ర్యంలో యాక్ష‌న్ సీన్స్ కంపోజ్ అవుతున్నాయ‌ట‌. డీజే దువ్వాడ‌లో పూర్తి స్థాయి గ్లామ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ్డ పూజా హెగ్డే, ఈ సినిమాలో కొత్త పాత్ర‌లో క‌న‌ప‌డునుంద‌న్న‌మాట‌.