ముంబైలో కొత్త ఇంట్లో అడుగుపెట్టిన పూజా హెగ్డే.. ప్రత్యేక పూజలు, ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా చెలామణి అవుతోన్న పూజా హెగ్డే ముంబైలో తన డ్రీమ్ హౌస్‌లో అడుగుపెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. చేతిలో కొబ్బరికాయతో కుటుంబ సభ్యుల సమక్షంలో పూజా హెగ్డే దర్శనమిచ్చింది. ఇక పూజా హెగ్డే ఆ ఇంటిని ఆధునిక హంగులతో విలాసవంతంగా తీర్చిదిద్దింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె గతేడాది తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫ్లాట్ సముద్రానికి ఎదురుగా ఉంటుందట. అంతేకాదు ముంబైలో ఉన్న ఈ కొత్త ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్ ను కూడా పూజా దగ్గరుండి చూసుకుందట.
‘‘ఒక లైలా కోసం’’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. వరుసపెట్టి సినిమాలు చేసినా చెప్పుకోదగ్గ పేరు రాలేదు. ఈ నేపథ్యంలో అల వైకుంఠపురం సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో పూజా పరిస్ధితి మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. 2020 నుంచి నేటి వరకు రిలీజైన స్టార్ హీరోల సినిమాలలో కథానాయిక పూజా హెగ్డేనే. ఆమె ఇప్పుడు ఎంత బిజీ అంటే కాల్షీట్లు, డేట్స్ అడ్జెస్ట్ చేయలేక కొన్ని సినిమాలను కూడా వదిలేసుకుంది.
ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’’, అలాగే మెగాస్టార్ చిరంజీవి ‘‘ఆచార్య’’, ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న ‘‘బీస్ట్ ’’ చిత్రంలో పూజానే హీరోయిన్. ఇవి కాకుండా పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో ఆమె ఛాన్స్ దక్కించుకున్నట్లుగా సమాచారం. సౌత్‌లో ఎంత స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నా.. ఆమె దృష్టంతా బాలీవుడ్ మీదే వున్నట్లుగా తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com