Pooja Hegde:పూజా హెగ్డే అందాల సెగలు .. పింక్ డ్రెస్‌లో తళుక్కున మెరిసిన బుట్టబొమ్మ, చూపు తిప్పుకోవడం కష్టమే
- IndiaGlitz, [Wednesday,July 19 2023]
టాలీవుడ్ అగ్రనేత పూజా హెగ్డే గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగులో అగ్ర కథానాయకులందరి సరసన నటించిన ఈ భామ.. ఇప్పుడు తన ఫోకస్ మొత్తాన్ని బాలీవుడ్‌పైనే పెట్టింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పూజా హెగ్డే. హిట్టు ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తున్నారామె. తాజాగా బవాల్ స్క్రీనింగ్‌లో పూజా హెగ్డే తళుక్కున మెరిశారు. పింక్ డీప్ నెక్లైన్ డ్రెస్‌లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు పూజ. ఈ డ్రెస్‌లో ఆమె చాలా హాట్‌గా కనిపించారు. తఎదురుగా అంత అందం వుంటే ఫోటోగ్రాఫర్లు ఊరుకుంటారా.. వెంటనే పూజ అందాలను తమ కెమెరాలో బంధించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు , పూజ అభిమానులు ఆమెను రెడ్ హార్ట్ ఎమోజీలతో ముంచెత్తారు.
అల వైకుంఠపురం సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో పూజా హెగ్డే రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఏ ఇండస్ట్రీలో చూసినా.. ఏ సినిమా చూసినా పూజానే హీరోయిన్. అప్పట్లో ఎంత బిజీ అంటే కాల్షీట్లు, డేట్స్ అడ్జెస్ట్ చేయలేక కొన్ని సినిమాలను కూడా ఆమె వదిలేసుకోవాల్సి వచ్చింది. దక్షిణాదిలో వచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్లో జెండా పాతాలని అడుగులు వేస్తున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె ఆ ప్రయత్నాల్లోనే వున్నారు. ముంబైలో ఇల్లు కొనుక్కున్న పూజా హెగ్డే.. ఆ ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా డిజైన్ చేయించుకున్నారు. షూటింగ్‌లతో బిజీగా వున్నప్పటికీ ఇంటీరియర్ డిజైన్, కలర్ వంటి విషయాలను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు.
ఇక ఇటీవల స్వల్ప విరామం దొరకడంతో పూజా హెగ్డే తన సొంతూరుకు వెళ్లారు. కర్ణాటకలోని రేవు పట్టణం మంగళూరు పూజా హెగ్డే సొంతూరు. ముంబైలో వుంటున్నప్పటికీ ఆమె అప్పుడప్పుడు తన సొంతూరుకు వెళుతూ వుంటారు. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించే పూజా.. తన వూరిలో మాత్రం సాంప్రదాయబద్ధంగా కనిపించేందుకే ప్రాధాన్యతనిస్తారు.