నగ్న చిత్రం పోస్ట్ చెయ్యిమన్న నెటిజన్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన పూజా హెగ్డే
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోహీరోయిన్లు అభిమానులకు చాలా దగ్గరగా ఉండటం కోసం ఇటీవలి కాలంలో సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్డేట్స్ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అలాగే వారానికో, పదిహేను రోజులకొకసారో అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ కూడా చేస్తూ.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. తద్వారా అభిమానులను ఖుషీ చేస్తున్నారు. అయితే కొన్ని సార్లు ఈ చిట్‌చాట్ కార్యక్రమాలు మిస్ ఫైర్ అవుతున్నాయి.
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ ముద్దుగుమ్మ కూడా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అయితే ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న అందుకు పూజ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన పూజపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్‌లోకి వచ్చిన పూజను ఓ నెటిజన్ ‘నీ నగ్న చిత్రం పోస్ట్ చెయ్యి’ అని పూజను అడిగాడు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు వేరొకరైతే చాలా సీరియస్ అయి ఉండేవారు. కానీ పూజ మాత్రం అలా చెయ్యలేదు. కూల్‌గా తన పాదాలను ఫొటో తీసి దానిని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఆవేశానికి లోను కాకుండా అద్భుతంగా పూజ స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పూజ ప్రస్తుతం తెలుగులో `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిరల్`, `రాధేశ్యామ్` చిత్రాల్లో నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com