పూజా హెగ్డే.. భలే ఛాన్స్ కొట్టేసింది!

  • IndiaGlitz, [Friday,January 17 2020]

కన్నడ కస్తూరి పూజా హెగ్డేకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. వరుసపెట్టి అగ్రహీరోలతో సినిమాలు చేస్తున్న పూజా.. తాజాగా మరోస్టార్ హీరోతో జతకట్టడానికి రెడీ అవుతోందట. ఇంతకూ ఆయనెవరు అనుకుంటున్నారా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అవును.. ఇది నిజమే. పవన్‌కు జోడీగా పూజ నటించనుందని టాక్. టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్.. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నడాన్న వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన పూజ నటించనుందట. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ‘పింక్‌’ రీమేక్ త‌ర్వాత‌ ఈ సినిమా ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే.. ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలోనూ పూజా హెగ్డే న‌టిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శుక్రవారం ఈసినిమాకు సంబంధించి అప్ డేట్ రానున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. పండగ సీజన్‌లో ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త అందించనున్నాడు ప్రభాస్.

ఇప్పటికే మహేశ్‌తో మహర్షి, బన్నీతో డీజే దువ్వాడ జగన్నాథమ్, అల వైకుంఠపురములో, రామ్‌చరణ్‌తో రంగస్థలంలో ఓ పాటలో నటించింది. ప్రభాస్ సినిమా పూర్తి కాకుండా పవన్, క్రిష్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇదంతా చూస్తున్నవారు పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యిందనుకుంటున్నారు.