తెలుగుపై పూజా హెగ్డే ఫోకస్
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకలైలా కోసం చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే తర్వాత ముకుంద, డీజే దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మహేశ్‌తో మహర్షి, ఎన్టీఆర్‌తో అరవింద సమేత.. ప్రభాస్, రాధాకృష్ణ చిత్రంలో హీరోయిన్గా నటించనుంది.
అయితే ఇప్పటికే తెలుగు నేర్చుకుంటున్న పూజా హెగ్డే ఇంకా ఫుల్ పోకస్ పెట్టింది. తన స్టాఫ్, షూటింగ్‌లోని ఇతర వ్యక్తులతో తెలుగులోనే మాట్లాడుతుందట. ఎలాంటి టీచర్ లేకుండా తెలుగు మాట్లాడటం ద్వారానే పట్టు సాధించాలని పూజా అనుకుందట. అందరూ కుర్ర హీరోయిన్స్ లాగానే కుదిరితే తనే డబ్బింగ్ చెప్పేస్తుందేమో మరి! కొన్ని రోజులు ఆగితే అసలు విషయం తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments