లిప్ లాక్ సమయంలో భయపడ్డ పూజా హెగ్డే
Send us your feedback to audioarticles@vaarta.com
ప్ర్తసుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నలుగురైదుగురు స్టార్ హీరోయిన్స్ మాత్రమే ఉన్నారు. వారిలో పూజా హెగ్డే ఒకరు. ఇప్పటికే మహేశ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్(రంగస్థలంలో సాంగ్)లో నటించింది. ఇప్పుడు ప్రభాస్‌తో `జాన్`(వినపడుతున్న టైటిల్) చిత్రంలో నటిస్తోంది. కొన్ని సన్నివేశాల్లో నటీనటులు చాలా కష్టపడతారని, అయితే ఆ కష్టం ప్రేక్షకులకు తెలియదని, వారు సన్నివేశాలను ఎంతో ఎంజాయ్ చేస్తారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఈ క్రమంలో ఆమె లిప్ లాక్స్ గురించి మాట్లాడుతూ ``తొలి లిప్ లాక్ సీన్‌ను హృతిక్ రోషన్ హీరోగా నటించిన మొహంజదారోలో చేశాను. సన్నివేశం గురించి దర్శకుడు అశుతోష్ గోవారికర్ వివరించారు. నేను కూడా ఆ సన్నివేశంలో నటించడానికి సిద్ధమయ్యాను. అయితే మా చుట్టూ చాలా మంది జనం ఉండటంతో భయపడ్డాను. లిప్‌లాక్ సీన్స్‌ను చూడటానికి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ సన్నివేశంలో నటించే ప్రేక్షకులు ఎంతో కష్టపడతారు. అలాంటి సమయంలో కెమెరా ట్రిక్స్ మాకు ఎంతగానో సాయపడతాయి`` అని పేర్కొన్నారు.
అల్లు అర్జున్‌తో డీజే దువ్వాడజగన్నాథమ్ తర్వాత పూజా హెగ్డే నటించిన చిత్రం `అల..వైకుంఠపురములో` జనవరి 12న విడుదల కానుంది. అలాగే ప్రభాస్ జాన్ 2020లో విడులవుతుంది. అలాగే బాలీవుడ్‌లో కూడా అవకాశాల కోసం పూజా హెగ్డే గట్టిగానే ప్రయత్నిస్తుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments