మనసులను కదిలిస్తున్న పూజా హెగ్డే మాటలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆస్ట్రేలియా అడవుల్లోని కార్చిచ్చు.. తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది. ఈ ప్రమాదంలో అరవై లక్షల హెక్టార్ల పచ్చని భూమి అగ్నికి ఆహుతైనట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. లక్షలాది మూగజీవాలు కాలి బూడిదయ్యాయి. వీటి చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ అగ్నిప్రమాదంపై జంతుప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందాల తార పూజా హెగ్డే స్పందించింది. విరాళాలు అందివ్వాలంటూ తనలోని జంతుప్రేమికురాలిని బయటపెట్టింది.
ఇంతకూ ఆమె ఏమన్నారంటే.. ‘‘మనం మరింత జాగ్రత్త పడాల్సిన సమయమిది. ఆస్ట్రేలియాలో జరుగుతున్నదాన్ని గమనిస్తే.. హృదయం ద్రవిస్తోంది. అక్కడి ఫొటోలను చూస్తుంటే చాలా బాధేసింది. అక్కడి మూగజీవాలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. మనమెంత వరకు చేయగలుగుతామో... దాన్ని విరాళాల రూపంలో చేయాలి. ఇది మన ఇంటి నుంచే మొదలవ్వాలి. ఆస్ట్రేలియా ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకుని.. మన దేశంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం చాలా జంతువులు కనుమరుగవుతున్నాయి. మన దగ్గర డబ్బుంటే.. విరాళాలు ఇవ్వగలమని తరుచుగా అనుకుంటుంటాం. కానీ నేను అనుకునేది ఏంటంటే.. మనం చేసే రూ.20, రూ.50 విరాళాలు కూడా ఎంతో పెద్ద సాయం చేసినట్టే. హింసను నేనెట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించను. అది మనుషులు కావొచ్చు.. జంతువులు కావొచ్చు. అయినా.. నీకు నచ్చనిది.. ఇతరులకు ఎందుకు చేయాలనకుంటావు’’ అని తెలిపింది.
పూజా హెగ్డే తాజా చిత్రం అల వైకుంఠపురములో విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments