టాలీవుడ్‌లో విషాదం.. పూజా ఎమోషనల్ ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కో డైరెక్టర్ సత్యం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సత్యం తన సీనీ కెరీర్‌లో ఎన్నో సినిమాలకు ముఖ్యంగా కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ల వద్ద కో డైరెక్టర్‌గా పనిచేశారు. రాజమౌళి-నితిన్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సై’కి చీఫ్ కో డైరెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే మగధీర, మర్యాద రామన్న సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ‘శ్రీరామదాసు, చందమామ, సాక్ష్యం, అల..వైకుంఠపురంలో’ సినిమాలకు సైతం కో డైరెక్టర్‌గా పనిచేశారు.
సత్యం మరణవార్త టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. సినీ ప్రముఖులంతా ఆయన మరణంపై స్పందిస్తూ.. సంతావం వ్యక్తం చేస్తున్నారు. సత్యం మరణవార్త విని స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ట్విటర్ వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆయనతో చేసిన సినిమాలను గుర్తు చేసుకుని సానుభూతి తెలిపింది. ‘‘కోడైరెక్టర్స్‌లో ఒకరైన సత్యం గారి మరణ వార్త చాలా బాధకు గురి చేసింది. ఆయనతో కలిసి నేను మూడు సినిమాలు చేశాను. ‘అరవింద సమేత వీర రాఘవ, సాక్ష్యం, అల.. వైకుంఠపురములో’ చిత్రాలు చేశాను. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా' అంటూ ట్వీట్ చేసింది.
ఇక సంగీత దర్శకుడు తమన్ సైతం సత్యం మరణంపై స్పందించారు. ఆయన మరణ వార్త విని షాక్ అయ్యానని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తమన్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘సత్యంగారి మరణ వార్త షాక్‌కు గురి చేసింది. ఒక గొప్ప వ్యక్తిత్వమున్న మనిషి సత్యంగారు. నమ్మకానికి, నిజాయితీకి మారు పేరుగా నిలుస్తారు. సెట్స్‌లో ప్రతి ఒక్కరితోనూ షూటింగ్ సమయంలో చాలా అగ్రెసివ్‌గా మెలుగుతూ ఆర్టిస్టులను, టెక్నీషియన్ టీంను ఫాలో అప్ చేస్తుంటారు. మిమ్మల్ని నిజంగా మిస్ అవుతున్నాం సర్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’ అని తమన్ ట్వీట్ చేశారు.
Sad to hear about the passing of one of my Co directors Satyam Garu, worked with him in 3 films Aravindha, Sakshyam and Ala Vaikunta. Sending his family loads of love and light in these tough times ?????? pic.twitter.com/gCOse1rXAg
— Pooja Hegde (@hegdepooja) April 17, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments