శభాష్ పూజా హెగ్డే.. 100 కుటుంబాల కోసం..

  • IndiaGlitz, [Wednesday,June 02 2021]

బుట్టబొమ్మ పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ సరసన నటించిన డీజే చిత్రం నుంచి ఆమె క్రేజ్ ఆకాశాన్ని తాకింది. బాలీవుడ్ లో కూడా ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయినే. క్యూట్ గా మాయ చేస్తూనే హాట్ గా కుర్రకారుని తనవైపు తిప్పుకుంది.

ఆ మధ్యన పూజా హెగ్డే కరోనాకి గురై కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనేక నిరుపేద కుటుంబాలు ఉపాధి లేక ఇల్లు గడవడమే కష్టంగా మారింది. అలాంటి వారిని ఆదుకునేందుకు పూజా హెగ్డే పెద్ద మనసుతో ముందుకు వచ్చింది.

ఇదీ చదవండి: చిన్నారికి చిరంజీవి ఫిదా.. బర్త్ డే రోజున ఏం చేసిందంటే..

పేద కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులను అందిస్తోంది. 100 కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని పూజ హెగ్డే అందిస్తోంది. పూజా పెద్ద మనసుతో చేస్తున్న ఈ సాయంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. స్వయంగా పూజా హెగ్డే నిత్యావసర సరుకుల్ని ప్యాక్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో బడా చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్ సరసన రాధే శ్యామ్ లో, మెగాస్టార్ ఆచార్యలో చరణ్ కు జోడిగా, అలాగే అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో పూజా నటిస్తుండడం విశేషం.