మహేష్ పక్కన పూజా కన్ ఫర్మ్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక లైలా కోసం, ముకుంద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే తదుపరిగా మొహంజదారో అనే బాలీవుడ్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం బాలీవుడ్ ప్లాప్ కావడంతో పూజా హెగ్డే టాలీవుడ్‌పైనే కాన్‌సన్‌ట్రేషన్ చేసింది. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన డీజే దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో నటించింది.
ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే పూజా హెగ్డే వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. రీసెంట్‌గా బెల్లంకొండ, శ్రీవాస్ కాంబినేషన్‌లో అవకాశం దక్కించుకుంది. అలాగే సూపర్‌స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కలిసి చేయబోయే సినిమాలో కూడా పూజా హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వనీదత్ కలిసి నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments