మహేష్ పక్కన పూజా కన్ ఫర్మ్...

  • IndiaGlitz, [Saturday,June 17 2017]

ఒక లైలా కోసం, ముకుంద చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన పూజా హెగ్డే త‌దుప‌రిగా మొహంజ‌దారో అనే బాలీవుడ్ చిత్రంలో న‌టించింది. ఆ చిత్రం బాలీవుడ్ ప్లాప్ కావ‌డంతో పూజా హెగ్డే టాలీవుడ్‌పైనే కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేసింది. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ స‌ర‌స‌న డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రంలో న‌టించింది.

ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గానే పూజా హెగ్డే వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటుంది. రీసెంట్‌గా బెల్లంకొండ‌, శ్రీవాస్ కాంబినేష‌న్‌లో అవ‌కాశం ద‌క్కించుకుంది. అలాగే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, వంశీ పైడిప‌ల్లి క‌లిసి చేయ‌బోయే సినిమాలో కూడా పూజా హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్ క‌లిసి నిర్మిస్తున్నారు.

More News