నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లా.. నమ్మలేకపోతున్నా: పూజా హెగ్డే
Send us your feedback to audioarticles@vaarta.com
నెల్సన్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్- పూజా హెగ్డే నటించిన ‘‘బీస్ట్’’ చిత్రం ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార గీతాల్లో విజయ్‌తో కలిసి డ్యాన్స్ మూవ్మెంట్లు, మ్యాచింగ్ స్టెప్స్‌తో పూజా హెగ్డే ఆకట్టుకుంటున్నారు. కాగా.. ఈ ఏడాది ఆగస్ట్‌తో పూజా హెగ్డే చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తవుతుంది. కెరీర్లో ఇప్పటి వరకు ఆమె 14 సినిమాల్లో నటించారు . రాబోయే రోజుల్లో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఆమె నటించిన ఐదు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్నాయి.
2012లో మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూగమూడితో తేరంగేట్రం చేసిన పూజా హెగ్డే.. దాదాపు పదేళ్ల తర్వాత ‘‘బీస్ట్’’తో కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. అల్లు అర్జున్ సరసన నటించిన అలా వైకుంఠపురంతో సైమా అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఈ సందర్భంగా బీస్ట్ సినిమాకు సంగతులను పూజా హెగ్డే మీడియాతో పంచుకున్నారు. సినీ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నానని అన్నారు.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన డీజేతో తన కెరీర్ ఊపందుకుందని పూజ చెప్పారు. కోవిడ్ తర్వాత పరిశ్రమ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తినడమంటే తనకు చాలా ఇష్టమని.. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తింటానని తెలిపారు. సూపర్‌స్టార్ విజయ్‌తో కలిసి పనిచేయడం బాగుందని... ఆయన వర్కింగ్ స్టైల్‌కి తాను అభిమానిని అన్నారు. బీస్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత విజయ్ పాత సినిమాలన్నీ చూశానని ఆయనొక స్వీట్ పర్సన్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే.. రణ్వీర్ సింగ్‌తో సర్కస్, సల్మాన్ ఖాన్‌తో ఫర్హాద్ సామ్జీ కభీ ఈద్ కభీ దీవాళి, మహేష్ బాబు- త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు పూజా హెగ్డే చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments