పని పూర్తి చేసిన పూజా హెగ్డే
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే రాధేశ్యామ్ తాజా షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ముప్పై రోజుల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ వేసి షూటింగ్ పూర్తి చేశారు. ప్రభాస్, పూజా హెగ్డేపై ఈ షెడ్యూల్లో పాట చిత్రీకరణ కూడా జరిగింది. లాంగ్ షెడ్యూల్ షూటింగ్ పూర్త్యయ్యిందని, ఇప్పుడు హైదరాబా్ నుండి ముంబై వెళుతున్నానని పూజా హెగ్డే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ షెడ్యూల్‌తో పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యింది. ఇక ప్రభాస్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ, ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంటుందని టాక్. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పీరియాడికల్ లవ్‌స్టోరిగా రూపొందుతున్న ఈ సినిమాలో యూరప్ బ్యాక్‌డ్రాప్ లవ్ ట్రాక్ ఉంటుంది. యువీ క్రియేషన్స్, గోపీ కృష్ణా మూవీస్ పతాకాలపై యువీ కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చి నెలలో రాధేశ్యామ్ విడుదలవుతుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments