‘పూజా’ జర జాగ్రత్త లేకుంటే అంతే సంగతులు!
- IndiaGlitz, [Tuesday,September 10 2019]
పూజా హెగ్దే.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకూ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అంతేకాదు.. అవకాశాలే ఆమె కోసం వెతుక్కుంటూ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి వస్తున్నాయంటే ఈ భామ రేంజే ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలుగు స్టార్ హీరోల సరసన చేసిన ఈ భామ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అలా తన అంద చందాలు ఆరబోసి తెలుగు యూత్ మనసు దోచుకుంది.
ఇక అసలు విషయానికొస్తే.. ఇప్పటి వరకూ అన్నీ ఓకే కానీ తాజాగా ఈ ముద్దుగమ్మ గురించి పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో పూజా హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్‌కు టైమ్‌కు రాకపోవడం.. ఇచ్చిన టైమ్‌కు రాకుండా ఇష్టానుసారం రావడం.. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం భోజన సమయానికి కూడా బయటకు వెళ్లి షూటింగ్‌కి ఎప్పుడు పడితే అప్పుడు రావడం చేస్తోందట. ఒక్క మాటలో చెప్పాలంటే ‘నేను వచ్చిందే టైమ్.. వచ్చినప్పుడే షూటింగ్ చేస్కోండి’ అన్నట్లుగా బీహేవ్ చేస్తోందట. పూజా ఇలా చేస్తుండటంతో సినిమా షూటింగ్ చాలా ఆలస్యమవుతోందట.
వాస్తవానికి మొదట్లో ఈ ముద్దుగుమ్మ గురించి అన్నీ పాజిటివ్ టాక్స్ వచ్చినప్పటికీ స్టార్ హీరోల సరసన నటించిన తర్వాత కాస్త ఓవర్ చేస్తోందనే మిక్స్డ్ టాక్ నడుస్తోంది. అయితే తాజాగా ఏకంగా బన్నీ సినిమాతో ఆ వ్యవహారం బయటపడిందంతే. ఏదేమైనప్పటకీ పూజా జర జాగ్రత్త పడి సక్రమంగా మెలిగితే సరే.. లేకుంటే అంతే సంగతులు మరి. కాదు లేదు అని తన వైఖరి మార్చుకోకుంటే మాత్రం కెరీర్‌పై పెద్ద దెబ్బే పడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.