వీడియో గేమ్ డెవలపర్‌గా పూజా హెగ్డే
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్రడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతోంది. అక్కడ మహేష్, కథానాయిక పూజా హెగ్డే, అల్లరి నరేష్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో పూజా పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఓ పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే వీడియో గేమ్ డెవలపర్ పాత్రలో పూజ కనిపించనుందట. స్టైలిష్‌గా కనిపిస్తూనే పెర్‌ఫార్మెన్స్‌తో ఎట్రాక్ట్ చేసే ఈ పాత్ర పూజ కెరీర్‌ను మలుపు తిప్పేలా ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com