చాలా గ్యాప్ త‌ర్వాత అక్క‌డ అడుగుపెడుతున్న పూజా హెగ్డే

  • IndiaGlitz, [Wednesday,January 20 2021]

స్టార్ హీరోయిన్‌గా అగ్ర హీరోల‌తో సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే మ‌రో స్టార్ హీరో సినిమాలో న‌టించే అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు పూజా హెగ్డే స్టార్ హీరో విజ‌య్ స‌ర‌స‌న న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మూగ‌మూడి అనే త‌మిళ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన పూజా హెగ్డే త‌ర్వాత తెలుగు, హిందీ చిత్రాల‌తో బిజి బిజీగా మారిపోయింది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ పూజా హెగ్డే త‌మిళంలో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పిన‌ట్లు టాక్.

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ నెక్ట్స్ మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. . నెల్స‌న్ న‌య‌న‌తార‌తో కోల‌మావు కోకిల విడుద‌లై సూప‌ర్‌హిట్ అయ్యింది. మ‌రో వైపు శివ‌కార్తీకేయ‌న్‌తో చేసిన డాక్ట‌ర్ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అంటే ఈ రెండు సినిమాల్లోనూ విడుద‌లైంది ఓ సినిమానే. బ‌డ్డింగ్ డైరెక్ట‌ర్ నెల్స‌న్‌కు విజ‌య్ అవ‌కాశం ఇవ్వ‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌నున్నారు.