మణిరత్నంకు పోటీగా.. ‘పొన్నియన్ సెల్వన్’ వెబ్ సిరీస్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎందరో తమిళ దర్శక నిర్మాతలు, స్టార్స్ చేయాలని ఆసక్తిగా ఎదురు చూసిన చారిత్రాత్మక నవల ‘పొన్నియన్ సెల్వన్’ను సినిమాగా తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఎవరికీ కుదరలేదు. ఎట్టకేలకు స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా తెరకెక్కుతుంది. విక్రమ్, కార్తి, జయంరవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్యమీనన్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే ‘పొన్నియన్ సెల్వన్’ వెబ్ సిరీస్‌గా తెరకెక్కనుంది. అజయ్ ప్రతాప్ అనే దర్శకుడు ఈ వెబ్ సిరీస్‌ను తొమ్మిది సీజన్స్‌లో రూపొందించనున్నారు.
ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ వెబ్ సిరీస్‌కు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ సినిమాలో నటించబోయే నటీనటుల వివరాలను ప్రకటిస్తామని దర్శకుడు తెలిపాడు. ఆగస్ట్ 18 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తొలి సీజన్‌ను వచ్చే ఏడాది..అంటే 2022 ఏప్రిల్ 14న విడుదల చేస్తామని దర్శకుడు అజయ్ ప్రతాప్ తెలిపారు. హైదరాబాద్, చెన్నై, మైసూర్, శ్రీలంక ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments