Ponguru Priya:నారాయణ నుంచి నాకు ప్రాణహానీ .. వాళ్లే చంపేసి , నేనే చేసుకున్నానని చెబుతారేమో : ప్రియా పొంగూరి
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ మంత్రి , టీడీపీ నేత పొంగూరు నారాయణపై ఆయన మరదలు ప్రియా పొంగూరు తన ఆరోపణలను తీవ్రతరం చేశారు. తనకు పిచ్చి అని, క్యాన్సర్ అని చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. సోషల్ మీడియాలో సుదీర్ఘ వీడియో పోస్ట్ చేసిన ప్రియా పొంగూరు.. ఈసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నవ్వితే మెంటల్ అంటే తానేం చేయలేనని.. 29 ఏళ్లుగా వాళ్లు పెట్టిన చిత్రహింసలను ఏడుస్తూ భరించానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ హింసను తట్టుకోలేక మా మెడికల్ కాలేజీలో వున్న డాక్టర్లు ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండేవారని.. వారి స్థానంలో డాక్లర్లను సప్లయ్ చేయడం డాక్టర్ వెంకటేశ్వరరావు పని అని ప్రియా అన్నారు. తన భర్తకు కిడ్నీల్లో రాళ్లు వచ్చినప్పుడు, ముక్కు సర్జరీ సమయంలో వెంకటేశ్వరరావును కలిశానని ఆమె పేర్కొన్నారు. నారాయణ ఫ్యామిలీలో అందరికి ముక్కులో ఓ వైపు భాగమే పనిచేస్తుందని.. అందుకే సర్జరీ అనేది మా కుటుంబంలో కామన్ అని ప్రియా వెల్లడించారు. తనను వెంకటేశ్వరరావు మరిచిపోయారో లేక మరిచిపోయినట్లు నటిస్తున్నారో తనకు తెలియడం లేదన్నారు.
తాను స్లిపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంది నిజమే :
తన భర్త చదివిన స్క్రిప్టే .. డాక్టర్ వెంకటేశ్వరరావు కూడా చదివారని ప్రియా ఆరోపించారు. అంతర్జాతీయ స్థాయి డాక్టర్లు అయినప్పుడు, తన గురించి చెప్పడానికి ఒక డాక్టర్ సరిపోరా అని ఆమె ప్రశ్నించారు. క్రికెట్‌లో సచిన్, ధోనీ.. సినిమాల్లో చిరంజీవిలు రాజ్యాలు ఏలారని .. మరి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు వున్న డాక్టర్లు ఒక్కరు సరిపోరా అని వెంకటేశ్వరరావును ఆమె ప్రశ్నించారు. తనకు ఆరోగ్యం బాలేదని.. డాక్టర్ల వద్దకు తిరుగుతున్నానని తన భర్త చెప్పారని, అది నిజమేనని తాను స్లిపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నానని దీనిని మాన్పించడానికి ఏఐజీలో మూడు రోజులు వున్నానని ప్రియా అంగీకరించారు. ఊటీలో వున్న తన కూతురుతో మాట్లాడినప్పుడు బాధపడిందని.. దీంతో తాను ఇంటికి వెళ్లిపోతానని డాక్టర్లతో చెప్పానని ఆమె గుర్తుచేశారు.
డబ్బులు తీసుకుని నారాయణకు డబ్బా :
డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో తాను సూసైడ్ చేసుకునే అవకాశం వుందని, అలాగే వేరే వారిని చంపేలా ప్రవర్తిస్తానని డాక్టర్లు రాశారని ప్రియా పేర్కొన్నారు. కానీ నాటి నుంచి నేటి వరకు తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని, వేరే వాళ్లని చంపే ప్రయత్నం కూడా తాను చేయలేదని , కనీసం చేయి కూడా చేసుకోలేదని అంతపెద్ద డాక్టర్ సీఎల్ వెంకట్రావుకు ఈ పాయింట్ గుర్తించలేదా అని ప్రియా ప్రశ్నించారు. ఇదంతా పక్కనబెట్టి నారాయణ గురించి డబ్బా కొట్టారని, ఈ రోజుల్లో డబ్బులిస్తే ఏమైనా చేయొచ్చని ఆమె దుయ్యబట్టారు. నారాయణకు తెలిసిన మనిషి.. ఎన్నో ఏళ్లుగా డబ్బులు తీసుకుంటున్న వ్యక్తి మరి నారాయణకే వత్తాసు పలుకుతాడని ప్రియా అన్నారు. నారాయణ ఎంఎస్సీ చదివే వరకు మా అత్తగారు ఫండింగ్ చేశారని తెలిపారు. మా అత్తగారి రెండో తమ్ముడు తిరుపతిలో వుండేవారని.. ఆయన ఇంట్లోనే నారాయణను వుంచి ఫీజు మాత్రం ఆమె కట్టేవారని ప్రియా చెప్పారు. అయితే ఆ ఇంట్లో పరిస్ధితులు నచ్చకపోవడంతో నారాయణ అక్కడ వుండనని మా అత్తగారికి చెప్పడంతో వేరే హాస్టల్‌లో వుంచి చదివించారని తెలిపారు.
ప్రాణహానీ వుందని ఫిర్యాదులో రాయలేదు :
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నారాయణ నుంచి తనకు ప్రాణహానీ వుందని రాశానని ఆరోపించారని.. కానీ తాను అలా చేయలేదని, వాళ్ల మాటలు చూస్తే అలా రాసువుంటే బాగుండేదని ప్రియా పేర్కొన్నారు. ఇక్కడి దాకా వచ్చినవాళ్లు తనను చంపేయడానికి కూడా వెనుకాడరని.. తన భర్త, బావగారి మీద కేసు పెట్టాల్సిందేనని ఆమె అన్నారు. తాను నారాయణను చంపాలనుకుంటే మీడియా ముందుకు వచ్చేదాన్ని కాదని.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేదాన్ని కాదని స్పష్టం చేశారు. ఆలయాల్లో జంతువులను బలి ఇవ్వడమే తనకు నచ్చదని.. అలాంటి ఆహారాన్ని తాను తిననని చెప్పారు. ఇటువంటి మనస్తత్వం వున్న తాను నారాయణను చంపలేను కాబట్టే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని ప్రియా చెప్పారు.
నారాయణ బారి నుంచి వాళ్లను కాపాడుకుందాం:
స్క్రిప్ట్ రాసినోళ్లు తనను సలహా అడిగినా ఈ వివరాలు చెప్పేదాన్నని ఆమె సెటైర్లు వేశారు. నారాయణ పేద విద్యార్ధులకు సాయం చేశారని, ఆయన ఎప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో దిగినా 15 మంది ఆయనకు స్వాగతం పలుకుతారంటూ చెప్పిన మాటలు అవాస్తవమన్నారు. అంతర్జాతీయ డాక్టర్లు తన జబ్బును నయం చేయలేదంటే వాళ్ల వద్దకు పేషెంట్లు ఎలా వెళ్తారని ఆమె ప్రశ్నించారు. ఈ విషయం కనీసం గుర్తుపెట్టుకోవాలి కదా అని ప్రియా సెటైర్లు వేశారు. సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లినోళ్లు అందరికీ పిచ్చి వున్నట్లేనా ఆమె ప్రశ్నించారు. మానసిక సమస్యలు , ఒత్తిడి ఇలా చాలా సమస్యలతో సైకియాట్రిస్ట్‌ను కలుస్తారని ప్రియా తెలిపారు. తనకు కరెంట్ షాక్ ఇవ్వాలని వాళ్లు భావిస్తున్నారేమోనని ఆమె ఆరోపించారు. చంపేసి తనకై తాను ప్రాణహానీ చేసుకుందని అంటారని ప్రియా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రిస్క్రిప్షన్‌లోనే రాశారని.. ప్రజలు ఎవరివైపు వుంటారో చూద్దామన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ఆడపిల్లలు, పనిచేస్తున్న మహిళా సిబ్బందిని కాపాడుకుందామని ప్రియా పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com