తెలుగు రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

  • IndiaGlitz, [Monday,May 13 2024]

తెలంగాణలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని మావోయిస్ట్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఇందులో ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, మంచిర్యాల, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలు ఉన్నాయి. ఇక మిగిలిన 106 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

మరోవైపు ఏపీలో కూడా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. పాడేరు, అరకు, రంపచోడవరంలో ఎన్నికల పోలింగ్‌ను అధికారులు ముగించారు. సాయంత్రం 4 గంటల లోపు క్యూలైన్లలో నిలుచున్న ఓట్లరకు ఓటేసేందుకు అవకాశం కల్పించారు. ఇక సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో కూడా 5 గంటలకు పోలింగ్ ముసిగింది. మిగిలిన 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

అటు ఏపీలో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, వృద్ధులు ఓటు వేసేందుకు క్యూ కట్టారు. రూరల్ ఏరియాలతో పాటు అర్బన్ ఏరియాల్లోనూ ఓటింగ్ శాతం పెరుగుతుండంటం శుభ పరిణామంగా అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం 4 గంటల వరకు 60శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. దీంతో పోలింగ్ సమయం ముగిసే నాటికి 80శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి విజయం అందిస్తుందో జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

More News

తాగొచ్చి దుర్భాషలాడాడు.. అందుకే ఓటర్‌ను కొట్టాను.. వైసీపీ అభ్యర్థి క్లారిటీ..

తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ కేంద్రంలో ఓటరుపై చేయి చేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో పోలింగ్‌ బహిష్కరించిన పలు గ్రామాలు

తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.  17 లోక్‌స‌భ నియోజకవర్గాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.

Vishaka Train: విశాఖ రైలు 9 గంటలు ఆలస్యం.. ఓటు వేస్తామా..? లేదా..? అనే ఆందోళన..

మన దేశంలో రైళ్ల ప్రయాణం గురించి ఓ సినీ కవి వ్యంగ్యంగా ఓ మాట చెప్పాడు. నువ్వు ఎక్కాల్సిన రైలు.. జీవితకాలం లేటు అని. ఆయన ఆ మాట ఎందుకు చెప్పాడో ఇప్పుడు ఏపీకి వచ్చే కొంతమంది

ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు.. టీడీపీ అభ్యర్థులపై దాడులు..

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కూటమి

Vanga Geetha: పిఠాపురంలో ఆసక్తికర ఘటన.. మెడలో ఎర్ర కండువా.. వంగా గీత ఫైర్..

ఏపీలో ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.