మావోయిస్టు ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు మరో గంట మాత్రమే మిగిలి ఉంది. అయితే 13 నియోజకవర్గాల్లో మాత్రం గంట ముందుగానే పోలింగ్ ముగిసింది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, పినపాక, ఇల్లందు, భద్రాచలం, సిర్పూర్ టీ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, అశ్వారావుపేట, కొత్తగూడెం, ములుగులో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా.. క్యూలో ఉన్న వారిని ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకూ 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గత ఎన్నికల్లో ఇదే సమయానికి 56శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17 శాతం నమోదైనట్లు చెప్పారు. ఆదిలాబాద్ 62.3, భద్రాద్రి 58.3, హన్మకొండ 49, హైదరాబాద్ 31.17, జగిత్యాల 58.6, జనగాం 62.2, భూపాలపల్లి 64.3, గద్వాల్ 64.4, కామారెడ్డి 59, కరీంనగర్ 56, ఆసిఫాబాద్ 59.62, మహబూబాబాద్ 65.05, ఖమ్మం 63.6, మహబూబ్ నగర్ 58.8, మంచిర్యాల 59.1, మేడ్చల్ 38.2, ములుగు 67.8, నాగర్ కర్నూల్ 57.5, నల్గొండ 59.9, నారాయణపేట 57.1, నిజామాబాద్ 56.5, నిర్మల్ 60.3, పెద్దపల్లి 59.2, సిరిసిల్ల 56.6, రంగారెడ్డి 42.4, సంగారెడ్డి 56.23, సిద్దిపేట 64.9, సూర్యాపేట 62.07, వికారాబాద్ 57.6, వనపర్తి 60, వరంగల్ 52.2, యాదాద్రి 64 శాతంగా పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. కాగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పూర్తి కానుంది.
అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. అయితే సెలవు ప్రకటించినా కూడా నగరవాసులు ఓటే వేసేందుకు సుముఖత చూపించలేదు. దీంతో ఎన్నికల అధికారులు ఎన్ని ప్రచారాలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఈరోజు సెలవు కావడంతో రేపు కూడా సెలవు పెట్టుకున్నారు. శనివారం, ఆదివారం ఎలాగే సెలవులు కాబట్టి హాలీడే ట్రిప్పులకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో పోలింగ్ శాతం గతంలో కంటే తగ్గింది. మరోవైపు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు మాత్రం తమ ఓటు హక్కు భారీగా వినియోగించుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout