మావోయిస్టు ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

  • IndiaGlitz, [Thursday,November 30 2023]

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు మరో గంట మాత్రమే మిగిలి ఉంది. అయితే 13 నియోజకవర్గాల్లో మాత్రం గంట ముందుగానే పోలింగ్ ముగిసింది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, పినపాక, ఇల్లందు, భద్రాచలం, సిర్పూర్ టీ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, అశ్వారావుపేట, కొత్తగూడెం, ములుగులో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా.. క్యూలో ఉన్న వారిని ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకూ 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గత ఎన్నికల్లో ఇదే సమయానికి 56శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17 శాతం నమోదైనట్లు చెప్పారు. ఆదిలాబాద్ 62.3, భద్రాద్రి 58.3, హన్మకొండ 49, హైదరాబాద్ 31.17, జగిత్యాల 58.6, జనగాం 62.2, భూపాలపల్లి 64.3, గద్వాల్ 64.4, కామారెడ్డి 59, కరీంనగర్ 56, ఆసిఫాబాద్ 59.62, మహబూబాబాద్ 65.05, ఖమ్మం 63.6, మహబూబ్ నగర్ 58.8, మంచిర్యాల 59.1, మేడ్చల్ 38.2, ములుగు 67.8, నాగర్ కర్నూల్ 57.5, నల్గొండ 59.9, నారాయణపేట 57.1, నిజామాబాద్ 56.5, నిర్మల్ 60.3, పెద్దపల్లి 59.2, సిరిసిల్ల 56.6, రంగారెడ్డి 42.4, సంగారెడ్డి 56.23, సిద్దిపేట 64.9, సూర్యాపేట 62.07, వికారాబాద్ 57.6, వనపర్తి 60, వరంగల్ 52.2, యాదాద్రి 64 శాతంగా పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. కాగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పూర్తి కానుంది.

అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. అయితే సెలవు ప్రకటించినా కూడా నగరవాసులు ఓటే వేసేందుకు సుముఖత చూపించలేదు. దీంతో ఎన్నికల అధికారులు ఎన్ని ప్రచారాలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఈరోజు సెలవు కావడంతో రేపు కూడా సెలవు పెట్టుకున్నారు. శనివారం, ఆదివారం ఎలాగే సెలవులు కాబట్టి హాలీడే ట్రిప్పులకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో పోలింగ్ శాతం గతంలో కంటే తగ్గింది. మరోవైపు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు మాత్రం తమ ఓటు హక్కు భారీగా వినియోగించుకున్నారు.

More News

KCR: చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్ దంపతులు

తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు సిద్ధిపేట జిల్లా చింతమడకలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓటర్లకు అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

OWK 2nd Tunnel: అవుకు రెండో టన్నెల్ ప్రారంభించిన సీఎం జగన్.. జాతికి అంకితం..

రాయలసీమ ప్రజల చిరకాల వాంఛన నెరవేర్చే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

Revanth Reddy: కుట్రతోనే నాగార్జునసాగర్ ఘటన.. కేసీఆర్ పన్నాగాలు ఫలించవు: రేవంత్

నాగార్జునసాగర్ వద్ద ఏర్పడిన ఉద్రిక్తత ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన

ప్రభుత్వంపై పచ్చమీడియా రాతలు.. నవ్విపోదురుగాక ప్రజలు..

పచ్చమీడియా ఎప్పుడూ చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రాస్తూనే ఉంటుంది. పచ్చ నేతలు మాట్లాడటం ఆలస్యం వాటిని తక్షణమే పచ్చ పత్రికల్లో కొద్దిగా మసాలా కారం

Vote: ఓటు వేయకపోతే జైలు శిక్ష, జరిమానాలు విధిస్తారు తెలుసా..?

మన దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది తప్పనిసరి కాదు. ఎవరి ఇష్ట ప్రకారం వారు ఓటు వేసుకోవచ్చు లేదంటే వేయకుండా ఉండవచ్చు.