Telangana Elections: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు మాత్రం అధికారులు అనుమతి ఇస్తున్నారు. 119 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తినా.. మొత్తంగా చూసుకుంటే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.గ గ్రామాలు, పట్టణాల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో మాత్రం ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. ఓటు వేయాలని ఎన్నికల సంఘం, పలువురు ప్రముఖులు ఎంత అవగాహన కల్పించినా నగరవాసుల్లో ఎలాంటి మార్పు రాలేదు.
మరోవైపు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, పినపాక, ఇల్లందు, భద్రాచలం, సిర్పూర్ టీ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, అశ్వారావుపేట, కొత్తగూడెం, ములుగులో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. అటు గత ఎన్నికల్లో కంటే ఈసారి పోలింగ్ శాతం తక్కువ నమోదైనట్లు తెలుస్తోంది.
తెలంగాణలో పోలింగ్ ముగియడంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. డిసెంబర్ 3న తెలంగాణతో పాటు మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఫలితాలు వెల్లడికానున్నాయి. పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments