Telangana Elections: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

  • IndiaGlitz, [Thursday,November 30 2023]

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు మాత్రం అధికారులు అనుమతి ఇస్తున్నారు. 119 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తినా.. మొత్తంగా చూసుకుంటే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.గ గ్రామాలు, పట్టణాల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో మాత్రం ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. ఓటు వేయాలని ఎన్నికల సంఘం, పలువురు ప్రముఖులు ఎంత అవగాహన కల్పించినా నగరవాసుల్లో ఎలాంటి మార్పు రాలేదు.

మరోవైపు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, పినపాక, ఇల్లందు, భద్రాచలం, సిర్పూర్ టీ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, అశ్వారావుపేట, కొత్తగూడెం, ములుగులో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. అటు గత ఎన్నికల్లో కంటే ఈసారి పోలింగ్ శాతం తక్కువ నమోదైనట్లు తెలుస్తోంది.

తెలంగాణలో పోలింగ్ ముగియడంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. డిసెంబర్ 3న తెలంగాణతో పాటు మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఫలితాలు వెల్లడికానున్నాయి. పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More News

మావోయిస్టు ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు మరో గంట మాత్రమే మిగిలి ఉంది. అయితే 13 నియోజకవర్గాల్లో మాత్రం గంట ముందుగానే పోలింగ్ ముగిసింది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల,

KCR: చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్ దంపతులు

తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు సిద్ధిపేట జిల్లా చింతమడకలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓటర్లకు అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

OWK 2nd Tunnel: అవుకు రెండో టన్నెల్ ప్రారంభించిన సీఎం జగన్.. జాతికి అంకితం..

రాయలసీమ ప్రజల చిరకాల వాంఛన నెరవేర్చే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

Revanth Reddy: కుట్రతోనే నాగార్జునసాగర్ ఘటన.. కేసీఆర్ పన్నాగాలు ఫలించవు: రేవంత్

నాగార్జునసాగర్ వద్ద ఏర్పడిన ఉద్రిక్తత ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన

ప్రభుత్వంపై పచ్చమీడియా రాతలు.. నవ్విపోదురుగాక ప్రజలు..

పచ్చమీడియా ఎప్పుడూ చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రాస్తూనే ఉంటుంది. పచ్చ నేతలు మాట్లాడటం ఆలస్యం వాటిని తక్షణమే పచ్చ పత్రికల్లో కొద్దిగా మసాలా కారం