ఏపీ రాజకీయాల్లో పార్టీల పరిస్థితిపై పోలింగ్ ఏజెన్సీ సర్వే..

ఏపీ రాజకీయాల్లో పార్టీల పరిస్థితేంటి? అధికార పార్టీ ప్రభ తగ్గిందా? ప్రతిపక్ష పార్టీకి మద్దతు పెరిగిందా? జనసేన పరిస్థితేంటి? ఎలాగైనా ఈ సారి తమ సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ పరిస్థితేంటి? అన్ని విషయాలపై తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వే సమాధానం చెబుతోంది. ఇప్పుడీ సర్వే హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా VDPAssociates R&D అనే పోలింగ్ ఏజెన్సీ ఓ సర్వే నిర్వహించి ఫలితాలు వెల్లడించింది. ఈ ఫలితాలపై రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.

సర్వేలో రాజకీయాల్లో పెద్దగా మార్పులైతే ఏమీ లేవని.. వైసీపీపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని వెల్లడైంది. టీడీపీ కొంత మేర తన ఓటు బ్యాంకును కోల్పోగా.. తాజాగా కాస్త మద్దతును కూడగట్టుకుందని సర్వే తెలిపింది. కాగా.. బీజేపీ మద్దతును రెట్టింపు చేసుకోగా.. జనసేన ప్రభ మరింత దిగజారింది. మొత్తానికి ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, టీడీపీల మధ్యనేనని సర్వే స్పష్టం చేసింది. వైసీపీకి రాష్ట్రంలో 52.97% మంది ప్రజలు మద్దతు తెలపగా.. టీడీపీకి 40.06% మంది.. జనసేనకు 3.56% మంది.. బీజేపీకి 2.20% మంది మద్దతు తెలిపారు. ఇతరులందరికీ కలిపి కేవలం 1.21% మంది మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం.

జగన్ సీఎంగా ఉండాలని 53.40 శాతం మంది కోరగా.. చంద్రబాబు సీఎంగా ఉండాలని 40.60 శాతం కోరగా.. 3.90 శాతం మంది పవన్ కళ్యాణ్‌ సీఎంగా ఉంటే బాగుంటుందని ఆకాంక్షించారు. ఇక దగ్గుబాటి పురందేశ్వరి సీఎం కావాలని 1.10 మంది, కన్నా లక్ష్మీనారాయణను 1 శాతం మంది కోరుకున్నారు. అలాగే జగన్ సర్కారు పని తీరుపై ప్రజానీకం 73 శాతం సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. అలాగే కేంద్ర ప్రభుత్వ పనితీరుకు 57 శాతం మద్దతు తెలిపారు. ఈ సర్వేలో 59.2 శాతం మంది ప్రజానీకం ఇసుక పాలసీని విమర్శించింది.

More News

వీపుపై కొట్టండి.. దయచేసి కడుపుపై కొట్టకండి: బండ్ల గణేష్ ఆవేదన

2018 ఎన్నికల సమయంలో రాజకీయ ఆరంగేట్రం చేసిన నిర్మాత బండ్ల గణేష్.. అమాయకంగా మీడియాకు దొరికిపోయారు.

అదే రిపీట్ చేస్తున్న శేఖ‌ర్ క‌మ్ముల‌

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో శేఖ‌ర్ క‌మ్ములకు సెన్సిబుల్ డైరెక్ట‌ర్ అనే పేరుంది.

జోనర్‌ విషయంలో క్లారిటీ ఇచ్చిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌

దర్శకుధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)‌’.

'ఎక్స్‌పైరీ డేట్‌'కి వస్తున్న స్పందన అమితానందాన్ని ఇచ్చింది! - దర్శకుడు శంకర్ కె. మార్తాండ్

తెలుగు సహా హిందీలోనూ వీక్షకాదరణ, ప్రశంసలు అందుకుంటున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్‌'. జీ 5లో ఎక్స్ క్లూజివ్ గా విడుదలైన సిరీస్‌కి దర్శకత్వం వహించినది తెలుగు దర్శకుడు శంకర్ కె. మార్తాండ్

తెలంగాణకు చెందిన ట్రంప్ వీరాభిమాని గుండెపోటుతో మృతి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వీరాభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. అయితే ఆ వీరాభిమాని ఎక్కడి వాడో కాదు..