Poll Strategy: ఏపీలో మరోసారి వైసీపీదే అధికారం.. తగ్గేదేలే..

  • IndiaGlitz, [Saturday,May 11 2024]

ఏపీలో పోలింగ్‌కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంంది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రజలను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అయితే ప్రతి సర్వేలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమని స్పష్టమవుతోంది. ఇప్పటికే అనేక సర్వేల్లో ఇదే తేలింది. తాజాగా మరో సంస్థ చేసిన సర్వేలోనూ వైసీపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని తేలింది.

ప్రముఖ సర్వే సంస్థ పోల్ స్ట్రాటజీ గ్రూప్.. ఏపీ రాజకీయాలపై తన సర్వేను నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చి చెప్పింది. ఈ ఏడాది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుంచి మే 7వ తేదీ మధ్యన ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. ఇందలుఓ 1,88,530 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించినట్లు పేర్కొంది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయంగా ఉంది.

ఈ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 109 అసెంబ్లీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తుంది. టీడీపీ కూటమి కేవలం 34 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని చెప్పుకొచ్చింది. ఇక 32 స్థానాల్లో టఫ్‌ ఫైట్ ఉంటుందని వివరించింది. అలాగే లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపిస్తుంది. 18 నుంచి 20 లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరనుంది. టీడీపీ కూటమి 5-7 స్థానాల్లో విజయం సాధించవచ్చని అభిప్రాయపడింది.

కాగా ఈ సర్వే ప్రకారం సీఎం జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పింది. అలాగే కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సర్వేలో పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ, విద్య, వైద్య రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలపై ప్రజలు సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో వైసీపీ పాలనపై పెద్ద ఎత్తున సానుకూలత ఉందని వివరించింది. మొత్తానికి ఏపీలో జగన్‌ పాలనకు తిరుగులేదని.. మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంచేసింది.

More News

తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం బంద్.. మూగబోయిన మైకులు..

తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర నెలలుగా మార్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. నేటితో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఏపీలో అధికారం దక్కించుకునేందుకు అధికార వైసీపీ,

Ram Charan - Allu Arjun: కోనసీమలో రామ్‌చరణ్.. రాయలసీమలో అల్లు అర్జున్ సందడి..

ఈసారి ఏపీ ఎన్నికల్లో సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తరపున పిఠాపురంలో మెగా హీరోలు, జబర్దస్త్ నటులు, నిర్మాతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

KCR: నేను కూడా ప్రధాని రేసులో ఉంటా.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణలో మరికొన్ని గంటల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి 200 నుంచి 220 సీట్లు మాత్రమే వస్తాయని తనకు సమాచారం ఉందన్నారు.

Vijayamma: షర్మిలను కడప ఎంపీగా గెలిపించండి: విజయమ్మ

ఏపీ ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రచారం ముగుస్తున్న సమయంలో సీఎం జగన్ తల్లి విజయమ్మ తన మద్దతు షర్మిలకు ప్రకటించడం సంచలనంగా మారింది.

అనైతిక చర్యలకు తెరదీసిన టీడీపీ.. మహిళల భద్రతకు పెనుముప్పు..

ఊరందరికీ నీతులు చెప్పడంలో ముందుండే తెలుగుదేశం పార్టీ.. ఆ నీతులను మాత్రం పాటించదు. ఎన్నికల్లో గెలవడం కోసం ఎలాంటి నీచానికైనా చంద్రబాబు ఒడిగొడుతారని వైసీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తు ఉంటారు.