వైజాగ్ రామానాయుడు స్టూడియోపై కన్ను.. సురేష్ బాబుపై రాజకీయ ఒత్తిళ్లు?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబుపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయా అంటే అవుననే ప్రచారం ఎక్కువవుతోంది. మూవీ మొఘల్ రామానాయుడు వైజాగ్ లో ఎంతో కష్టపడి నిర్మించిన రామానాయుడు స్టూడియోపై ప్రభుత్వ కన్ను పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అందమైన విశాఖ నగరంలో రామానాయుడు స్టూడియో వ్యవహారం రాజకీయ చర్చకు దారితీస్తోంది.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులలో వైజాగ్ కూడా ఒకటి. దీనితో రాజధాని కార్యాలయాల కోసం రామానాయుడు స్టూడియోపై ప్రభుత్వం గురిపెట్టినట్లు తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోను స్వాధీనం చేసుకునేందుకు గత ఏడాది నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయట.
ఇదీ చదవండి: ఇన్స్టాలో రిచ్ వీరే: ప్రియాంకని బీట్ చేసిన కోహ్లీ.. ఒక్కో పోస్ట్ కి అన్ని కోట్లా!
వైసీపీకి చెందిన ఓ బడా నేత సురేష్ బాబుపై ఒత్తిడి పెంచుతున్నట్లు టాక్. వైజాగ్ రాజధాని కోసం రామానాయుడు స్టూడియోని ప్రభుత్వానికి ఇచ్చేయాలని సురేష్ బాబుని అడిగారట. గత నవంబర్ నుంచే ఈ ప్రయత్నాలు మొదలైనట్లు టాక్. తన తండ్రి ముచ్చటపడి, కష్టపడి నిర్మించుకున్న స్టూడియో కావడంతో కుదరదని సురేష్ బాబు సున్నితంగా చెప్పినట్లు తెలుస్తోంది.
ఎలాగైనా రామానాయుడు స్టూడియో దక్కించుకోవాలని సురేష్ బాబుపై క్రమంగా పొలిటికల్ ప్రెజర్ పెంచుతున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ అందమైన ప్రాంతం. హైదరాబాద్ తో సమానంగా ఇక్కడ కూడా ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది అని భావించిన రామానాయుడు వైజాగ్ లో ఖర్చుకు వెనకాడకుండా స్టూడియో నిర్మాణానికి పూనుకున్నారు.
రామానాయుడు లాంటి నిర్మాత ఏపీలో స్టూడియో నిర్మాణానికి ముందుకు రావడంతో అప్పటి ప్రభుత్వం భీమిలి మండలం తిమ్మాపురం సర్వే నంబరు 337లో 34.44 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అది పూర్తిగా కొండ ప్రాంతం కావడంతో అక్కడ స్టూడియో నిర్మాణానికి రామానాయుడు ఆయన తనయుడు సురేష్ బాబు ఎంతో శ్రమించాల్సి వచ్చింది.
అయినప్పటికీ 10 ఎకరాల్లో కొండ ప్రాంతాన్ని చదును చేసి స్టూడియో నిర్మించారు. కొండపై స్టూడియోకు అందమైన ఘాట్ రోడ్ కూడా వేశారు. రామానాయుడు తర్వాత ఆయన తనయుడు క్రమంగా స్టూడియోని అభివృద్ధి చేస్తున్నారు. ఈ తరుణంలో దానిపై ప్రభుత్వం కన్నేసిందనే టాక్ ఊపందుకుంది.
అది ప్రభుత్వం కేటాయించిన స్థలమే కాబట్టి తిరిగి ఇచ్చేయాలని అడుగుతున్నారట. దానికి బదులుగా భీమిలి ప్రాంతంలోనే మరో చోట ఇంకా ఎక్కువ స్థలం కేటాయిస్తామని అక్కడ స్టూడియో నిర్మించుకోవాలని సురేష్ బాబుకు సూచిస్తున్నారట. సురేష్ బాబు మాత్రం అందుకు సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com