అన్నీ రూమర్సేనట.. నవీన్ క్లారిటీ
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ 106వ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓ షెడ్యూల్‌ను రామోజీ ఫిలింసిటీలో పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. రెండో షెడ్యూల్ ప్రారంభం కావాల్సిన తరుణంలో కరోనా వైరస్ దేశంలోకి రావడంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ సమయంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడు. అదే సమయంలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పొలిశెట్టి ఈ చిత్రంలో బాలకృష్ణ అసిస్టెంట్ పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.
అయితే తాను బాలయ్యగారి సినిమాలో నటిస్తున్నానని వస్తున్న వార్తలపై నవీన్ పొలిశెట్టి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పేశాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తర్వాత నవీన్ నటించిన జాతిరత్నాలు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే తన తదుపరి సినిమాపై క్లారిటీ ఉంటుందని నవీన్ పొలిశెట్టి క్లియర్‌గా చెప్పేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments