పోలీసోడు ఆడియో రిలీజ్ వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్, సమంత, ఎమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రుపొందిన తమిళ చిత్రం తెరి. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పోలీసోడు అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏప్రిల్ 14న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
పోలీసోడు ఆడియోను ఈనెల 6న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన పోలీసోడు ఆడియో రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తెలియచేసింది. ఏప్రిల్ 14న తెలుగు, తమిళ్ లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు. మరి ఆడియో రిలీజ్ వాయిదా వేసినట్టు సినిమా రిలీజ్ కూడా వాయిదా వేస్తారా..? లేక సినిమాను ముందుగా ప్రకటించిన డేట్ ఏప్రిల్ 14నే రిలీజ్ చేస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments