విజయ్ ఇంటికి పోలీసులు.. అర్థరాత్రి హైడ్రామా

  • IndiaGlitz, [Sunday,July 05 2020]

కోలీవుడ్ స్టార్ విజయ్ ఇంటికి అర్ధరాత్రి వెళ్లిన పోలీసులు.. ఇల్లంతా గాలించారు. ఉన్నట్టుండి పోలీసులు రావడం సోదాలు నిర్వహిస్తుండటంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు అవాక్కయ్యారు. అసలు విషయం ఏంటంటే.. పోలీసులకు విజయ్ ఇంట్లో బాంబ్ ఉన్నట్టు అర్ధరాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు హుటాహుటిన విజయ్ ఇంటికి చేరుకుని ఇంటిని జల్లెడ పట్టి.. బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటి వద్ద కాసేపు హైడ్రామా నడిచింది

అనంతరం తమకు అర్ధరాత్రి ఉరుకులు పరుగులు పెట్టించిన ఫోన్ కాల్‌పై పోలీసులు దృష్టి సారించారు. చివరకు ఆ వ్యక్తి ఆచూకీ కనుక్కున్నారు. తమకు విజయ్ ఇంట్లో బాంబ్ ఉందని ఫోన్ చేసిన వ్యక్తి చెన్నైలోని విల్లుపురానికి చెందిన వాడని.. అతనికి మతిస్థిమితం లేదని తెలుసుకున్నారు. దీంతో సదరు వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబ సభ్యులను హెచ్చరించి అక్కడి నుంచి పోలీసులు వచ్చేశారు.

More News

హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా టులెట్ బోర్డులే..

ఒకప్పుడు హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు కావాలంటే గగనమే. చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. అప్పుడు కానీ దొరికేది కాదు.

ఈ లక్షణాలుంటే మీకు కరోనా ఉన్నట్టే..

రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. అలాగే కరోనా లక్షణాల జాబితా కూడా పెరిగిపోతోంది.

రూట్ మారుస్తున్న రామ్‌చ‌ర‌ణ్‌..?

మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ మెగాభిమానుల‌ను మెప్పిస్తున్నాడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌.

సినీ నటికి కూల్‌డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చి అత్యాచారం..

ఓ ప్రైవేటు సంస్థకు సీఈవోగా ఓ బహుభాషా నటితో పరిచయం పెంచుకున్నాడో వ్యక్తి. ఆపై ఆమెకూ తమ కంపెనీలోనే ఉద్యోగం కల్సించాడు.

‘మర్డర్’పై నమోదైన కేసుపై స్పందించిన వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ‘మర్డర్’పై మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌లో నిన్న కేసు నమోదైంది.