విజయ్ ఇంటికి పోలీసులు.. అర్థరాత్రి హైడ్రామా
Send us your feedback to audioarticles@vaarta.com
కోలీవుడ్ స్టార్ విజయ్ ఇంటికి అర్ధరాత్రి వెళ్లిన పోలీసులు.. ఇల్లంతా గాలించారు. ఉన్నట్టుండి పోలీసులు రావడం సోదాలు నిర్వహిస్తుండటంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు అవాక్కయ్యారు. అసలు విషయం ఏంటంటే.. పోలీసులకు విజయ్ ఇంట్లో బాంబ్ ఉన్నట్టు అర్ధరాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు హుటాహుటిన విజయ్ ఇంటికి చేరుకుని ఇంటిని జల్లెడ పట్టి.. బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటి వద్ద కాసేపు హైడ్రామా నడిచింది
అనంతరం తమకు అర్ధరాత్రి ఉరుకులు పరుగులు పెట్టించిన ఫోన్ కాల్‌పై పోలీసులు దృష్టి సారించారు. చివరకు ఆ వ్యక్తి ఆచూకీ కనుక్కున్నారు. తమకు విజయ్ ఇంట్లో బాంబ్ ఉందని ఫోన్ చేసిన వ్యక్తి చెన్నైలోని విల్లుపురానికి చెందిన వాడని.. అతనికి మతిస్థిమితం లేదని తెలుసుకున్నారు. దీంతో సదరు వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబ సభ్యులను హెచ్చరించి అక్కడి నుంచి పోలీసులు వచ్చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com