హీరో నాగశౌర్యకు షాకిచ్చిన పోలీసులు

  • IndiaGlitz, [Tuesday,August 13 2019]

యువ కథానాయకుడు నాగశౌర్యకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. ఈ కుర్ర హీరో ప్రయాణిస్తున్న కారుకు బ్లాక్ ఫిలిం ఉండటాన్ని గమనించిన పోలీసులు బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 1లో కారును ఆపారు. పంజాగుట్ట ఎస్సై రవి నాగశౌర్య రూ.500 జరిమానా విధించడంతో పాటు.. కారుకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు. మన దేశంలో కారు అద్దాలకు బ్లాక్ ఫిలిమ్ వాడటాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఇదే విషయంపై హీరో బన్నీకి కూడా పోలీసులు రూ.750 ఫైన్ వేశారు. ప్రస్తుతం నాగశౌర్య తన బ్యానర్‌లో రూపొందుతోన్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.