'పోలీస్ పవర్' ఆడియో విడుదల!
- IndiaGlitz, [Friday,January 27 2017]
సర్వేశ్వర మూవీస్ బ్యానర్‌పై శివ జొన్నగడ్డ హీరోగా గుద్దేటి బసవప్ప మేరు నిర్మిస్తున్న చిత్రం పోలీస్ పవర్'. ఈ చిత్రంలోని పాటలు గురువారం హైదరాబాద్ లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ డీజీపీ గోపీనాథ్ రెడ్డి సీడీ ఆవిష్కరించి తొలి కాపీని ప్రసన్నకుమార్ కు అందజేశారు.
అనంతరం గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ...'' శివ తొలి సినిమా నుంచి నాకు తెలుసు. అనుకున్నది సాధించగల వ్యక్తి. 'పోలీస్ పవర్' టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో ట్రైలర్ కూడా అంత పవర్ ఫుల్ గా ఉంది. ఈ పాటలు, ట్రైలర్స్ చూశాక నాకు ఆశ్చర్యమేసింది. శివలో ఇంత మంచి దర్శకుడు, నటుడు ఉన్నాడా అని. బి.సి.సెంటర్స్ లో బాగా ఆడే సినిమా. తమిళ్ లో కూడా విడుదల చేస్తే బాగుంటుంది. ఈ సినిమా సక్సెస్ సాధించి మా నిర్మాత బసవప్పకు, టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా'' అన్నారు.
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ...'' పాటలు, ట్రైలర్స్ చాలా బావున్నాయి. నటుడుగా, దర్శకుడుగా రెండింటికీ న్యాయం చేశాడు శివ. ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా'' అన్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ...'' ఉమేష్ చంద్రలాంటి ఎంతో మంది పవర్ పోలీస్ ఆఫీసర్స్ మనకున్నారు. అలాంటి పోలీస్ కథాంశంతో 'పోలీస్ పవర్' చేస్తోన్న శివను అభినందిస్తున్నా. ట్రైలర్ లోనే పోలీస్ పవర్ ఏంటో చూపించాడు. పాటలు కూడా కమర్షియల్ గా బావున్నాయి. తన తొలి సినిమా నుంచి ప్రతి ఆడియో ఫంక్షన్ కు పేద పిల్లలకు, వికలాంగులకు తన వంతు సాయపడుతూ వస్తున్నాడు. ఈ ఆడియో ఫంక్షన్ లో కూడా చదువుకునే ఆడపిల్లలకు సైకిల్స్ పంపిణీ చేయడం శివ యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. శివ కోసమైనా ఈ సినిమా సూపర్ హిట్ కావాలన్నారు.
సాంస్కృతిక కళాబంధు సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ...'' శివని 'డాన్స్ చేద్దాంరా' సినిమా దగ్గర నుంచి చూస్తున్నా. పట్టుదల గల వ్యక్తి. ప్రతి సినిమా ఆడియో ఫంక్షన్ లో తన వంతు సాయం చేస్తూ తన సేవాగుణాన్ని చాటుకున్నాడు. ఇక సినిమా విషయానికొస్తే పాటలు, ట్రైలర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ సినిమా ఘన విజయం సాధించి శివ మరెన్నో చిత్రాలు చేసే అవకాశం రావాలి. ఎంతో మందికి సాయపడాలన్నారు.
హీరో, డైరక్టర్ జొన్నలగడ్డ శివ మాట్లాడుతూ...'' కాల్ మనీ నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాము. మా కుటుంబ సభ్యులు, మా నిర్మాత కూడా పోలీస్ ఆఫీసర్ ఎంతో కాలం వారి సేవలందించి రిటైర్డ్ అయ్యారు. వారిని దగ్గర నుంచి చూసిన నేను ఈ సినిమా కథ రాసుకుని నేనే నటిస్తూ డైరక్షన్ చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా పోలీస్ పవరేంటో చూపించండి సాంగ్ ప్రజాదరణ పొందుతున్న నమ్మకం ఉంది. ఈ పాటలో పోలీస్ అంటే ఏమిటో చెప్పడం జరిగింది. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందన్నారు.
చిత్రం గురించి నిర్మాత గుద్దేటి బసవప్ప మేరు మాట్లాడుతూ... జనవరి 1న టీజర్‌ను రిలీజ్ చేశాం. మేం అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. యుట్యూబ్‌లో, టీవీ ఛానల్స్‌లో వేల సంఖ్యలో వీక్షించారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ఇందులో ఏడు ఫైట్లు, ఐదు పాటలున్నాయి. శివ హీరోగా, డైరక్టర్ గా సినిమాకు పూర్తి న్యాయం చేశాడు. ఒక పోలీస్ గా ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ'' పోలీస్ పవరేంటో చూపించండి అనే పాట పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఈ పాట కోసం శివగారు ఎంతో శ్రమించారన్నారు.
శివ జొన్నలగడ్డ, నందినికపూర్ హీరో హీరోయిన్లుగా, మల్లిక, చదలవాడ హరిబాబు, మహంతి, రమేష్‌నాయుడు, మలినేని లక్ష్మయ్య చౌదరి, నాగరాజు, బాబూరావు, గణపతి, ఆనంద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.ఎస్. కుమార్, బాపు, ఫైట్స్, యాక్షన్: అవినాష్, పాటు: రుద్రంగి రమేష్, సంజయ్‌గాంధీ, ఎడిటింగ్: అనుగోజు రేణుకబాబు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: చంద్రారెడ్డి, డాన్స్: వినయ్, నిర్మాత: గుద్దేటి బసవప్ప మేరు, కథ, మాటలు, సంగీతం ' స్క్రీన్‌ప్లే ' దర్శకత్వం: శివ జొన్నలగడ్డ.