‘చలో ట్యాంక్‌బండ్’లో కలకలం.. మావోలు రంగంలోకి దిగారా!?
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొన్ని రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్స్‌ను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తేలేదని.. ఆరు నూరైనా ప్రవైటీకరణ తప్పదని సీఎం కేసీఆర్ ఇప్పటికే తేల్చిచెప్పడం.. ఆ తర్వాత వెంటనే కార్మికులు విధుల్లో చేరాలని డెడ్‌లైన్ విధించడం జరిగింది. అయితే కేసీఆర్ పిలుపు మేరకు సుమారు 360 మంది దాకా విధుల్లో చేరగా మిగిలిన వారు మాత్రం సమ్మెబాటలోనే ఉన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు కార్మికులు, కార్మిక నేతలు, పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ‘చలో ట్యాంక్‌బండ్’కు పిలుపునిచ్చాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు పరిస్థితులు అంతా సక్రమంగానే ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం దాటగానే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్.
రణరంగంగా మారిన ట్యాంక్‌బండ్!
కార్మికులు చేపట్టిన ఈ చలో ట్యాంక్‌బండ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇదే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ రాజకీయ నేతలు, కార్మిక నేతలను శుక్రవారం నుంచే ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించడం.. మరోవైపు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేయడం జరిగింది. దీంతో అంతా ప్రశాంతం అనుకున్నారు. అయితే ఒక్కసారిగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలన్నీ ఒక్కసారి రణరంగాన్ని తలపించాయి. ఒక్కసారిగా వేలాది మంది ఆందోళనకారులు భారీ కేడ్లు, పోలీసులను సైతం లెక్కచేయండా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. అంతేకాదు ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.. దీంతో ఆందోళనకారులు ఆగ్రహానికిలోనై వారిపై రాళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో పలువురు పోలీసులు, ఆందోళనకారులు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించి ట్రాఫిక్ ఆంక్షలు కఠినం చేశారు.
మావోలు రంగంలోకి దిగారా!?
కార్మికులు, కార్మిక నేతలు ఈ రేంజ్‌లో సాహసం చేయరని స్పష్టంగా అర్థమవుతోంది. ఆర్టీసీ కార్మికులు మావోయిస్టులతో చేతులు కలిపారనే అనుమానాలు పోలీసులకు ఎప్పట్నుంచో ఉన్నాయి. బహుశా పరిస్థితి ఇలా ఉద్రిక్తంగా మారుతుందని పోలీసులు గానీ కేసీఆర్‌గానీ ఊహించి ఉండరేమో. కాగా మావోలు రంగంలోకి దిగితే పరిస్థితులు శృతిమించిపోతాయ్.. అసలు ఇందులో నిజానిజాలెంత అనేది తెలియాల్సి ఉంది.
మరోసారి కేసీఆర్ సమీక్ష!?
ఇప్పటికే ఆర్టీసీపై పలుమార్లు సమీక్షలు నిర్వహించిన సీఎం కేసీఆర్.. శనివారం నాడు మరోసారి సంబంధిత మంత్రి, అధికారులతో సమావేశమయ్యారు. పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతుండటంతో ‘ఏం చేద్దాం’ అని ఇవాళ చర్చించనున్నారు. హైకోర్టుకు వరుసగా మొట్టికాయలేయడం, ఇవాళ్టి ఘటనలు, ఆర్టీసీ స్థితిగతులపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో వాదనలపై కేసీఆర్ చర్చించనున్నారు.
ఏం చేస్తారో ఏంటో..!?
మొత్తానికి చూస్తే.. కేసీఆర్ వార్నింగ్‌కు మాత్రం అస్సలు తగ్గట్లేదు.. దీంతో రోజురోజుకు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయో తప్ప అదుపులోకి వచ్చేలా మాత్రం కనపడట్లేదు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు.. మావోలు చేతులు కలిపారనే అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయ్. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ వారిలో నిజమైన ఆందోళనకారులెవరో..? కార్మికులెవరో..? మావోలు ఎవరో..? లెక్కలు తేలాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒక మెట్టు వెనక్కి తగ్గుతారా..? లేకుంటే అస్తమాను కోర్టుతో మొట్టికాయలు వేయించుకుంటూనే ఉంటారా..? అనేది సోమవారంతో తేలిపోనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments