4 గంటలపాటు విచారణ..కత్తి మహేష్ స్నేహితుడు చెప్పిన విషయాలేంటి ?
Send us your feedback to audioarticles@vaarta.com
కత్తి మహేష్ రోడ్డు ప్రమాదం, మృతి కేసులో పోలీసులు విచారణని వేగవంతం చేశారు. కత్తి మహేష్ మృతి విషయంలో అనుమానాలు ఉన్నాయని మందకృష్ణ మాదిగ, కత్తి మహేష్ తండ్రి ఓబులేసు చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో ఏపీ ప్రభుత్వం కత్తి మహేష్ మృతిపై విచారణకు ఆదేశించింది. దీనితో నెల్లూరు పోలీస్ అధికారులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు.
ముందుగా ఆరోజు కారు డ్రైవ్ చేసిన కత్తి మహేష్ స్నేహితుడు సురేష్ తో విచారణ ప్రారంభించారు. ఆరోజు జరిగిన సంఘటన గురించి పోలీసులు సురేష్ ని కూలంకుషంగా విచారించారు. దీనితో సురేష్ కూడా పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
విజయవాడలో బయలుదేరినప్పటి నుంచి ప్రమాదం జరిగేవరకు అన్ని అంశాలని సురేష్ పోలీసులతో ప్రస్తావించారు. కత్తి మహేష్ తనకు స్నేహితుడే అని సురేష్ తెలిపాడు. ఆయనకు సరిగా డ్రైవింగ్ రాదని అందుకే తాను కారు డ్రైవ్ చేసినట్లు సురేష్ పోలీసులకు చెప్పారు. ప్రమాదం జరిగే సమయంలో కత్తి మహేష్ నిద్రలో ఉన్నారని.. సీటు బెల్టు కూడా వెనుక నుంచి పెట్టుకోవడంతో ఎక్కువ గాయాలు అయ్యాయని అన్నారు.
తాను మాత్రం సీటు బెల్టు బాగా పెట్టుకుని ఉండడం వల్ల గాయాలు కాలేదని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను కత్తి మహేష్ సోదరికి ఫోన్ చేసినట్లు సురేష్ తెలిపారు. కత్తి మహేష్ ని ఆసుపత్రికి తరలించే వరకు తాను పక్కనే ఉన్నట్లు సురేష్ తెలిపారు. ఆ తర్వాత జరిగింది అందరికి తెలిసిందే. నెల్లూరులో చికిత్స అనంతరం కత్తి మహేష్ ని చెన్నైకి తరలించారు.
అక్కడ సర్జరీలు కూడా పూర్తయి కత్తి మహేష్ కోలుకుంటున్నారనే వార్తలు వచ్చాయి.కానీ సడెన్ గా కత్తి మహేష్ ఆరోగ్యం విషమించి మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. అనేక వివాదాల్లో ఇన్వాల్వ్ అయిన కత్తి మహేష్ కు చాలామంది శత్రువులు ఉన్నారని.. అందువల్ల కత్తి మహేష్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ దళిత నేత మందకృష్ణ మాదిగ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments