హేమంత్‌ది పరువు హత్యేనని తేల్చిన పోలీసులు

  • IndiaGlitz, [Monday,September 28 2020]

హేమంత్ మర్డర్ కేసును అన్ని రకాలుగా విచారించిన మీదట అతనిది పరువు హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే హేమంత్‌ని హత్య చేశారని ఈ కేసును విచారిస్తున్న గచ్చిబౌలి పోలీసులు తేల్చారు. సుపారీ గ్యాంగ్‌తో కలిసి హేమంత్‌ను మర్డర్ చేయించినట్టు నిర్ధారణ అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్ రెడ్డి ఒప్పుకున్నారు. అవంతి- హేమంత్‌ల ప్రేమ విషయం తెలుసుకున్న లక్ష్మారెడ్డి తన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించి ఆమెను బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

జూన్‌ 10న ఇంట్లో కరెంట్‌ పోవడంతో సీసీ కెమెరాల్లో రికార్డ్‌ కాదని తెలుసుకున్న అవంతి ఇంట్లో నుంచి హేమంత్‌తో కలిసి పారిపోయి వివాహం చేసుకుంది. దీంతో రగిలిపోయిన అవంతి తల్లిదండ్రులు.. ఆమె మేనమామతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం హేమంత్‌ను హత్య చేయించారు.
హేమంత్‌ హత్య కేసులో మొత్తం 25మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. నిందితులను 5రోజుల కస్టడి కోరుతూ ఎల్బీనగర్‌ కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. జహీరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌ మీద సీసీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. నిందితులను కస్డడిలోకి తీసుకొని పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ను అవంతి, హేమంత్‌ కుటుంబసభ్యులు కలవనున్నారు.