దేవరాజ్ కారణంగానే శ్రావణి ఆత్మహత్య..!
Send us your feedback to audioarticles@vaarta.com
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఎన్నో ములుపుల అనంతరం ఓ కొలిక్కి వస్తోంది. ఈ కేసులో ఎస్సార్ నగర్ నగర్ పోలీసులు నిర్వహించిన విచారణకు తుది అంకానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. దేవరాజ్‌రెడ్డి కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ప్రాణప్రదంగా ప్రేమించిన తనను దేవరాజ్ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. దేవరాజ్, సాయికృష్ణలను మూడు రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. దీనిలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తొలుత సాయికృష్ణతో శ్రావణికి పరిచయం ఏర్పడింది. అతని ద్వారా కొన్ని సినిమా అవకాశాలను కూడా శ్రావణి దక్కించుకుంది. అనంతరం టీవీ సీరియల్స్‌లో అవకాశాలు లభించాయి. ఈ క్రమంలో ఏడాది క్రితం శ్రావణికి దేవరాజ్ పరిచయమయ్యాడు. శ్రావణి దేవరాజ్‌కు దగ్గరవడాన్ని సాయికృష్ణ సహించలేకపోయాడు. దీంతో శ్రావణి కుటుంబ సభ్యుల ద్వారా సాయికృష్ణ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా ఆమె నిరాకరించింది. మరోవైపు శ్రావణి అంతలా ప్రేమించిన దేవరాజ్‌రెడ్డి సైతం పెళ్లికి నిరాకరిస్తూ ఆమెకు మెసేజ్ చేశాడు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన శ్రావణికి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్రధారణకు వచ్చారు.
అయితే శ్రావణి తల్లిదండ్రులు సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. శ్రావణి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. శ్రావణిని సాయికృష్ణ కొట్టినప్పటికీ అది ఆమె మంచికోసమేనని తెలిపారు. ఆత్మహత్యకు ముందు బాత్రూం నుంచి శ్రావణి దేవరాజ్‌కు ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని కోరినప్పటికీ అతడు నిరాకరించాడని వెల్లడించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com