Kumari Aunty: కుమారి ఆంటీపై కేసు నమోదు.. వ్యాపారం క్లోజ్ చేయించిన పోలీసులు..

  • IndiaGlitz, [Tuesday,January 30 2024]

ఇటీవల కాలంలో ఫేమస్ అయిన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని కోహినూరు హోటల్ ఎదురుగా చిన్న ఫుడ్ స్టాల్‌ను నిర్వహిస్తున్నారు. చవకగా, రుచికరమైన వెజ్, నాన్ వెజ్ వెరైటీలతో ఫుడ్ అందిస్తున్న ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. దీంతో యూట్యూబ్ ఛానళ్లు, న్యూస్ ఛానళ్లు ఆమెతో వీడియాలు తీసేందుకు పోటీ పడుతున్నారు. సెలబ్రెటీలు సైతం ఆంటీ దగ్గర ఫుడ్ తినేందుకు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే ఆమె నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారనే వార్త వైరల్‌గా మారింది. ఫేమస్ కావడమే ఇప్పుడు ఆమె కొంపముంచింది.

సోషల్ మీడియాలో ఆంటీ పేరు మార్మోగడంతో యువత అంతా ఆమె దగ్గర భోజనం చేసేందుకు ఎగబడుతున్నారు. ఫలితంగా అక్కడ రద్దీ ఎక్కువై రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలో కస్టమర్లను నిలువరించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇక చేసేదేమీ లేక ట్రాఫిక్ జామ్‌కు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా షాప్ క్లోజ్ చేయించారు.

పోలీసులు తీరుతో కుమారి ఆంటీ కన్నీటి పర్యంతమయ్యారు. సోషల్ మీడియా అతి ప్రచారం వల్ల అసలుకే మోసం జరిగిందంటూ ఆమె యుట్యూబర్స్‌ను తిట్టిపోస్తున్నారు. ఇక్కడ తామొక్కరమే భోజనం అమ్మడం లేదని చాలా మంది అమ్ముతున్నారని వారిని వదిలేసి పోలీసులు తమనే టార్గెట్‌ చేశారని ఆరోపించారు. జీవనాధారం అయిన ఫుడ్ స్టాల్ మూసివేయడంతో తాము ఎలా బతకాలని లబోదిబోమంటున్నారు. గిట్టని వాళ్లే పోలీసుల చేత ఇలా చేయించారని ఆరోపిస్తున్నారు.

కాగా ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి.. మాదాపూర్‌లోని కోహినూరు హోటల్ ఎదురుగా 2011లో ఫుడ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలను తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. కేవలం 5 కేజీల రైస్‌తో ప్రారంభమైన ఆమె వ్యాపారం.. ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగానే అమ్ముతున్నారు. లక్షల్లో సంపాదిస్తున్నారని హైలెట్ చేయడంతో ఇప్పుడు ఏకంగా ఆమె వ్యాపారానికే ఎసరు తెచ్చిపెట్టింది. పాపులారింటీ తెచ్చిన మీడియానే ఆమెను ఆదుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు .

More News

Gaddar Statue: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

దివంగత ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి HMDA ఆమోదం తెలిపింది.

Adimoolam: నారా లోకేష్‌తో సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం భేటీ

ఎన్నికల వేళ వైసీపీలో అసంతృప్త రాగాలు ఎక్కువతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోకి వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

Pushpa 2:పుష్ప2 నుంచి చీరలో బన్నీ గెటప్ లీక్.. దర్శకుడు సుకుమార్ సీరియస్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Prof Kodandaram: తెలంగాణ హైకోర్టులో ప్రొఫెసర్ కోదండరామ్‌కు షాక్

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరామ్, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం

Ayyannapatrudu: సీఎం జగన్ నుంచి షర్మిలకు ప్రాణహాని ఉంది: అయ్యన్నపాత్రుడు

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ప్రాణహాని ఉందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. "సీఎం జగన్ చాలా దుర్మార్గుడు.