నిర్మాత సి. కళ్యాణ్ పై కేసు నమోదు.. ఆ ముగ్గురితో కలసి బెదిరిస్తూ..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ పై కేసు నమోదైంది. ఓ భూవివాదం కారణంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో గోపికృష్ణ అనే వ్యక్తి సి కళ్యాణ్ తో పాటు మరో ముగ్గురు షారూప్, శ్రీకాంత్, తేజస్వి లపై కేసు నమోదు చేశారు.
తమ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి బెదిరింపులకు పాల్పడుతున్నారని గోపికృష్ణ ఈ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. స్వరూప్ అనే వ్యక్తి అమెరికాలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. 1985లో డాక్టర్ స్వరూప్ షేక్ పేట ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ నుంచి 60 గజాల భూమిని కొనుగోలు చేశారు.
ఇదీ చదవండి: తన సొంత నిర్మాణంలో అవికా గోర్ చిత్రం.. రేపే టైటిల్ రిలీజ్
2015లో స్వరూప్ ఈ భూమిని నారాయణ మూర్తి అనే వ్యక్తికి లీజుకి ఇచ్చారు. నారాయణ మూర్తి ఆ స్థలంలో ఆర్గానిక్ స్టోర్ నడుపుతున్నారు. అయితే సోమవారం సాయంత్రం షారూప్, శ్రీకాంత్, తేజస్వి ఆ ల్యాండ్ లోకి ప్రవేశించారు. అడిగితే సి. కళ్యాణ్ మనుషులం అంటూ బెదిరింపులకు దిగారని, ఆర్గానిక్ స్టోర్ కు తాళం వేసి వెళ్లారని సమాచారం. దీనితో డాక్టర్ స్వరూప్ సోదరుడు గోపికృష్ణ రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. సి కళ్యాణ్ తరచుగా వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. సి కళ్యాణ్ టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత. బాలయ్యతో జైసింహా, రూలర్ లాంటి చిత్రాలని నిర్మించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout