Naga Susheela:హీరో నాగార్జున సోదరి నాగ సుశీలపై కేసు.. టాలీవుడ్‌లో కలకలం
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నాగార్జున సోదరి, సుశాంత్ తల్లి అక్కినేని నాగసుశీలపై పోలీస్ కేసు నమోదైంది. ఓ ఆశ్రమంపై దాడి చేశారనే ఆరోపణలతో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుశీలపై కేసు నమోదు చేశారు. శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రమంపై ఈ నెల 12న నాగసుశీల, ఆమె మనుషులు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదుదారుడు ఆరోపణలు చేశారు. దర్శపీఠ నిర్వాహకుడు చింతలపూడి శ్రీనివాసరావుపై వీరు దాడి చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని స్వీకరించిన పోలీసులు నాగసుశీలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా.. గతంలోనూ నాగ సుశీలపై ఇలాంటి కేసులు కొత్త కాదు. నాగసుశీల గతంలో తన వ్యాపార భాగస్వామి అయిన చింతలపూడి శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసు పెట్టారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ భూమిని విక్రయించారని ఆరోపిస్తూ నాగసుశీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భూమిని అమ్మేసి ఆ వచ్చిన నగదు దుర్వినియోగం చేసినట్లు ఆమె ఆరోపించారు. దీనిపై శ్రీనివాస్ స్పందించారు. లాకప్‌లో పెట్టయినా సరే తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకు తనపై నాగ సుశీల కేసు పెట్టారని ఆరోపించారు. సుశీల కుమారుడు సుశాంత్ హీరోగా ఇద్దరూ కలిసి సినిమాలు తీశారు. అయితే అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో తీవ్రంగా నష్టపోయామని శ్రీనివాస్ చెప్పారు.
నాగ సుశీల, శ్రీనివాసరావులు శ్రీనాగ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి పలు సినిమాలు తీశారు. దీనితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేశారు. అయితే ఇద్దరి మధ్యా మనస్పర్ధలు రావడంతో దూరం పెరిగింది. ఇదే సమయంలో ఓ భూ వివాదం కూడా వున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఓ సినిమా కోసం శ్రీనివాసరావు రూ.5 కోట్లు సమకూర్చినట్లు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com